Samantha : వ‌రుస ఆఫర్లు వ‌స్తున్నా స‌మంత నో చెబుతోంద‌ట‌.. ఎందుకు..?

May 18, 2022 11:46 AM

Samantha : నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌రువాత నుంచి స‌మంత త‌న కెరీర్‌లో గ‌తంలో ఎన్న‌డూ లేనంత బిజీగా మారింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఓ వైపు సినిమాలు, మ‌రోవైపు సిరీస్‌లు.. ఇంకోవైపు ప్ర‌మోష‌న్స్.. బ్రాండ్ల‌కు యాడ్స్‌.. ఫొటోషూట్స్.. తీరిక దొరికితే వెకేష‌న్స్.. ఇలా స‌మంత చాలా బిజీ అయిపోయింది. ఈ క్ర‌మంలోనే ఈమెకు ప్ర‌స్తుతం తెలుగులోనే కాక ప‌లు ఇత‌ర భాష‌ల్లోనూ చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ఈ మ‌ధ్యే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి ఖుషి అనే సినిమాను ఈమె ప్రారంభించింది. ఇలా వ‌రుస సినిమాల‌తో స‌మంత బిజీగా ఉంది. అయితే ఈమెకు హిందీలో ప్ర‌స్తుతం అనేక ఆఫర్లు వ‌స్తున్నాయ‌ట‌. కానీ వాటికి ఆమె నో చెబుతోంద‌ని తెలుస్తోంది.

హిందీలో స‌మంత‌కు ప్ర‌స్తుతం అనేక సినిమాల్లో ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌ని స‌మాచారం. అయితే వాటిని స‌మంత అంగీక‌రించ‌డం లేద‌ట‌. అందుకు కార‌ణం కూడా లేక‌పోలేదు. స‌మంత‌కు వ‌స్తున్న ఆఫ‌ర్ల‌లో చాలా వ‌ర‌కు సెకండ్ హీరోయిన్ ఆఫ‌ర్లేన‌ట‌. దీంతో ఆమె వాటిపట్ల పెద్ద‌గా ఆస‌క్తిని చూపించ‌డం లేద‌ని తెలుస్తోంది. కేవ‌లం మెయిన్ రోల్‌లో హీరోయిన్ గా ఆఫ‌ర్ వ‌స్తేనే చేస్తా.. అని మేక‌ర్స్‌కు ఈమె క‌చ్చితంగా చెబుతోంద‌ట‌. ఇక అలా అయినా స‌రే కొంద‌రు బాలీవుడ్ నిర్మాత‌లు ఈమెతో సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో స‌మంత ఒకేసారి 2 లేదా 3 బాలీవుడ్ సినిమాల‌పై ప్ర‌క‌ట‌న చేస్తుంద‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే ఈమె మ‌రింత బిజీగా మారిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Samantha rejecting Hindi movie offers what is the reason
Samantha

ఇక స‌మంత న‌టించిన య‌శోద అనే సైన్స్ ఫిక్ష‌న్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఆగ‌స్టులో రిలీజ్ కానుంది. ఈ మూవీ నుంచి స‌మంత‌కు చెందిన టీజ‌ర్‌ను ఇటీవ‌లే లాంచ్ చేయ‌గా.. అది ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాపై అంచ‌నాలు కూడా రోజు రోజుకీ పెరుగుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment