Balakrishna : బాలకృష్ణ ఇంటి గేట్‌ను కారుతో ఢీకొట్టిన మ‌హిళ‌.. వీడియో..!

May 18, 2022 7:35 AM

Balakrishna : హైద‌రాబాద్ లోని నంద‌మూరి బాల‌కృష్ణ ఇంటి వ‌ద్ద మంగ‌ళ‌వారం (మే 17) సాయంత్రం కాస్త అల‌జ‌డి రేగింది. ఓ మ‌హిళ బాల‌కృష్ణ ఇంటి గేట్‌ను కారుతో ఢీకొట్టి అనంత‌రం అక్క‌డే ఉన్న ఫెన్సింగ్‌కు ఢీకొని ఆగిపోయింది. దీంతో చాలా సేపు అక్క‌డ ట్రాఫిక్ జామ్ నెల‌కొంది. అయితే ఎట్ట‌కేల‌కు అంతా స‌ద్దుమ‌ణిగింది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో ఓ మ‌హిళ మ‌హింద్రా కంపెనీకి చెందిన థార్ వాహ‌నాన్ని న‌డుపుతూ వ‌స్తోంది. అయితే వెనుక నుంచి వ‌స్తున్న ఆంబులెన్స్‌కు దారి ఇవ్వాల‌న్న ఉద్దేశంతో ఆమె త‌న కారును ఓవ‌ర్ స్పీడ్‌తో న‌డిపించింది. దీంతో కారు కంట్రోల్ అవ‌లేదు. ఫ‌లితంగా ఆ కారు ప‌క్క‌నే ఉన్న డివైడ‌ర్‌ను ఢీకొట్టింది.

woman car accident at Balakrishna house in hyderabad
Balakrishna

ఇక డివైడ‌ర్‌ను ఢీకొన్న అనంత‌రం ఆ కారు బాల‌కృష్ణ ఇంటి గేటు వ‌ద్ద‌కు వ‌చ్చి దాన్ని ఢీకొట్టింది. అనంత‌రం అక్క‌డే ఉన్న ఫెన్సింగ్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ క్ర‌మంలోనే బాల‌కృష్ణ ఇల్లు కావ‌డంతో అస‌లు ఏం జ‌రిగిందా.. అనే విష‌యం తెలుసుకునేందుకు అక్క‌డ చాలా మంది గుమిగూడారు. దీంతో కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్ నెల‌కొంది. అయితే ట్రాఫిక్ పోలీసులు అక్క‌డికి చేరుకుని ఆ కారును తొల‌గించారు. అలాగే ఆ మ‌హిళ‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. కానీ ఆమె మ‌ద్యం తీసుకోలేద‌ని వెల్ల‌డైంది. అయితే ఆంబులెన్స్‌కు దారి ఇవ్వ‌డం కోస‌మే స్పీడ్‌గా కారును న‌డిపితే అలా జ‌రిగింద‌ని ఆమె పోలీసుల‌కు వివ‌ర‌ణ ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

https://twitter.com/RVKRao2/status/1526593631401848832

 

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment