Sarkaru Vaari Paata First Review : స‌ర్కారు వారి పాట ఫ‌స్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

May 11, 2022 9:47 PM

Sarkaru Vaari Paata First Review : యంగ్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా వ‌చ్చిన చిత్రం.. స‌ర్కారు వారి పాట‌. ఈ సినిమా మే 12న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలోనే 2 ఏళ్ల నుంచి ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక అనేక కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ మూవీ ఎట్ట‌కేల‌కు విడుద‌ల‌వుతోంది. దీంతో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా.. అని ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు గాను అమెరికాలో ఒక రోజు ముందుగానే ప్రీమియ‌ర్స్ వేస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. ఆ ప్రీమియ‌ర్ షోను చూసిన రివ్యూయ‌ర్ ఉమైర్ సంధు స‌ర్కారు వారి పాట సినిమాకు రివ్యూ ఇచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో ఆయ‌న చెప్పేశారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు.

Sarkaru Vaari Paata First Review know how is the movie
Sarkaru Vaari Paata First Review

స‌ర్కారు వారి పాట సినిమా అంచనాల‌కు మించి ఉంద‌ని ఉమైర్ సంధు అన్నారు. మ‌హేష్ ప‌వ‌ర్ ప్యాక్డ్ యాక్ష‌న్, మాస్ సీన్ల‌ను ఇందులో చూడ‌వ‌చ్చ‌ని.. దీంతో మ‌హేష్‌ను ఎలాగైతే చూడాల‌నుకున్నారో.. ఫ్యాన్స్‌కు ఆ కోరిక నెర‌వేరుతుంద‌న్నారు. మాస్ ప్రేక్ష‌కుల‌కు అయితే ఈ మూవీని చూస్తే పూన‌కాలు రావ‌డం ఖాయ‌మ‌ని అన్నారు. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్ అవుతుంద‌ని.. దీంతో మ‌హేష్ హ్యాట్రిక్ విజ‌యం సొంతం చేసుకోవ‌డం ఖాయ‌మ‌ని అన్నారు.

ఇక ఈ మూవీకి థ‌మ‌న్ సంగీతం అందించారు. ఆయ‌న స్వ‌ర ప‌రిచిన పాట‌లు అద్భుతంగా ఉన్నాయి. మొద‌ట్లో విడుద‌లైన క‌ళావ‌తి పాట‌తోపాటు త‌రువాత వ‌చ్చిన పెన్నీ సాంగ్‌.. ఈ మ‌ధ్యే విడుద‌లైన సినిమా టైటిల్ సాంగ్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. దీంతో ప్రేక్ష‌కుల‌కు ఈ మూవీ చక్క‌ని వినోదం అందించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment