Anchor Varshini : బాబోయ్.. క్యూట్ అందాల‌తో మెంటలెక్కిస్తున్న వ‌ర్షిణి..!

May 4, 2022 6:53 PM

Anchor Varshini : మ‌ల్లెమాల షోస్‌తో ఎక్కువ‌గా పాపుల‌ర్ అయిన అందాల ముద్దగుమ్మ వ‌ర్షిణి. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టునే అభిన‌యంతో మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంటుంది ఈ అందాల ముద్దుగుమ్మ‌. శ్రీముఖి తరువాత ఆ స్థానం వర్షిణిదే. అయితే వాళ్ళ రేంజ్ పాపులారిటీ, క్రేజ్ ఇంకా వర్షిణికి దక్కలేదు. అందుకే ఇంకా అడపాదడపా ప్రోగ్రామ్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన వర్షిణికి టైం కల‌సి రాలేదు. ఆమె హీరోయిన్ గా నటించిన ఒక్క చిత్రం కూడా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. దీంతో సపోర్టింగ్ రోల్స్ చేయడం ప్రారంభించింది.

Anchor Varshini latest black and white photos trending
Anchor Varshini

పటాస్ 2 స‌మయంలో వ‌ర్షిణి యాంకర్ గా అద‌ర‌గొట్టి ఢీ ఛాన్స్ కొట్టేసింది. డాన్స్ రియాలిటీ షో ఢీ సీజన్ 12లో వర్షిణి టీమ్ లీడర్ గా సందడి చేసింది. ఆ షోతో వర్షిణి బాగా పాపులర్ అయింది. ఢీ షోలో సుధీర్ రష్మితో రొమాన్స్ చేస్తుంటే.. హైపర్ ఆదితో వర్షిణి రొమాన్స్ చేసేది. ఆది, వర్షిణి జంటకు మంచి మార్కులే పడ్డాయి. అనూహ్యంగా ఆమెను ఢీ సీజన్ 13నుండి తొలగించారు. ఇటీవల మొదలైన ఢీ 14లో కూడా వర్షిణి లేదు. దీంతో ఈ అమ్మ‌డు వేరే ఛానల్స్‌లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటోంది.

మల్లెమాల షోస్ ద్వారా పరిచయం అయిన భానెట్ట‌మ వర్షిణి సౌందర్ రాజన్ తన అందంతో కుర్రకారు గుండెలను మెలితిప్పడం అలవాటు చేసుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కేక పెట్టించే అందాల‌తో మంత్ర ముగ్ధుల‌ని చేస్తోంది. ప్ర‌స్తుతం వ‌ర్షిణి క్యూట్ ఫొటోలు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈ అమ్మడు 2010లోనే శంభో శివ శంభో సినిమాలో చిన్న కామియో రోల్ ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. ఇక చందమామకథలు, కాయ్ రాజా కాయ్, నన్ను దోచుకుందువటే, జోడీ లాంటి సినిమాల్లో తళుక్కున మెరిసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment