మోహ‌న్ లాల్ 12th Man సినిమా నేరుగా ఓటీటీలోనే.. రిలీజ్ డేట్ ఫిక్స్‌..!

May 4, 2022 9:49 PM

12th Man : మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్ ఇటీవ‌లి కాలంలో వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న జీతూ జోసెఫ్‌తో క‌లిసి దృశ్యం దాని సీక్వెల్ దృశ్యం 2 చేయ‌గా.. అవి ఘన విజయం సాధించాయి. ఇప్పుడు హ్యాట్రిక్ సినిమాగా ట్వల్త్ మేన్ (12th Man)తో సంద‌డి చేయ‌నున్నారు. ఈ సినిమా కూడా వీరి ముందు సినిమా దృశ్యం 2 లాగే డిజిటల్ లో రిలీజ్ కానుంది. డిస్నీ ప్ల‌స్‌ హాట్‌స్టార్‌లో నేరుగా విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ను ఇటీవ‌ల విడుదల చేశారు. ప్రతి వ్యక్తికి సొంతదైన జీవితం, వ్యక్తిగత జీవితం, రహస్య జీవితం అనే మూడు విభిన్న జీవితాలు ఉంటాయని ఈ టీజర్ చెబుతోంది.

Mohan Lal 12th Man movie direct OTT release date is here
12th Man

టీజర్ చివర్లో ఫైనల్ విజిల్ వేసే సమయం వచ్చింది అనే మోహన్‌లాల్ డైలాగ్‌ టీజర్ పై ఆసక్తిని పెంచుతోంది. జీతూ, మోహన్‌లాల్‌ మరో థ్రిల్లర్ తో మన ముదుకు వస్తున్నట్లు అర్థం అవుతోంది. ఈ సినిమాలో ఉన్ని ముకుందన్, సైజు కురుప్, శివద, అను సితార, అనుశ్రీ, ప్రియాంక నాయర్, అను మోహన్ ఇతర కీలక పాత్రధారులు. ఇక మోహన్ లాల్.. దృశ్యం 2 , బ్రో డాడీ వంటి హిట్ చిత్రాల తర్వాత డైరెక్ట్ గా మరోసారి ఓటీటీలో రాబోతున్నారు. ఈ సినిమాని మే 20న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తాజాగా ప్ర‌క‌టించారు. ఈ చిత్రంతో మోహన్ లాల్ ఓటీటీలో హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి.

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ సూప‌ర్ స్టార్స్‌లో మోహన్ లాల్ ఒకరు. కంటెంట్, కలెక్షన్లు.. రెండింటి పరంగానూ మలయాళ ఇండస్ట్రీని గొప్ప స్థాయికి తీసుకెళ్లిన ఘనత కూడా ఆయనకు సొంతం. మాలీవుడ్‌లో కలెక్షన్ల పరంగా మేజర్ రికార్డులన్నీ మోహన్ లాల్ పేరిటే ఉన్నాయి. ఇతర భాషల్లో సూపర్ స్టార్లతో పోలిస్తే మోహన్ లాల్‌ను భిన్నంగా నిలబెట్టేది మాత్రం ఆయన ఎంచుకునే కథలు, పాత్రలే. ఇమేజ్ బంధనాలకు దూరంగా సినిమాలను తీసుకెళ్లే మోహన్ లాల్ కు ఆయ‌న న‌టించిన దృశ్యం సినిమానే భారీ ఇమేజ్ తెచ్చిపెట్టింది. అక్క‌డ నుండి వైవిధ్య‌మైన చిత్రాలు చేసుకుంటూ వెళుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment