Hansika : పాల అందాల‌తో బికినీలో రెచ్చిపోయిన హ‌న్సిక‌.. వీడియో..!

May 2, 2022 1:20 PM

Hansika : పాల మీగ‌డ లాంటి అందంతో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్న అందాల ముద్దుగుమ్మ హ‌న్సిక‌. ఈ అమ్మ‌డు అందాల‌కు మైమ‌ర‌చిపోని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హన్సిక మోత్వానీ తెలుగులో చాలానే సినిమాలు చేసింది. హిందీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కేరీర్ ను స్టార్ట్ చేసింది. హీరోయిన్‌గా మాత్రం పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన దేశ ముదురు సినిమాతో ప‌రిచ‌యం అయింది. తొలి సినిమాలోనే త‌న అందం, న‌ట‌న‌తో ఎంత‌గానో ఆక‌ట్టుకుంది హ‌న్సిక‌.

Hansika latest vacation photos viral
Hansika

16 ఏండ్లకే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారుని త‌న బుట్ట‌లో ప‌డేసుకున్న హ‌న్సిక‌… గత రెండేళ్లుగా సినిమాల‌కు గ్యాప్ ఇచ్చి.. ఇప్పుడు మళ్లీ వెట మొదలు పెట్టింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి చేతిలో అర‌డ‌జ‌నుకి పైగా సినిమాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఒక‌వైపు సినిమాల‌తో బిజీగా ఉంటూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తోంది. ఈ అమ్మ‌డు రీసెంట్‌గా బికినీలో రెచ్చిపోయింది. లేలేత అందాలు చూపిస్తూ కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేసింది. హ‌న్సిక గ్లామ‌ర్ షోను చూసి ప్ర‌తి ఒక్క‌రూ మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ప్ర‌స్తుతం హ‌న్సిక ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

హ‌న్సిక తెలుగులో కంత్రి, మస్కా, బిల్లా, జయీభవ, సీతారాముల కళ్యాణం, కందిరీగ, ఓ మై ఫ్రెండ్, సింగం 2, పవర్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చివరిగా దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి తెరకెక్కించిన తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ మూవీతో సందీప్ కిషన్ సరసన నటించింది. ఈ మూవీ 2019లో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు త‌మిళ సినిమాల‌తో చాలా బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ రానున్న రోజుల‌లో తెలుగు సినిమాల‌తో అల‌రించేందుకు కూడా స్కెచ్‌లు వేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Hansika Motwani (@ihansika)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment