ఈమె ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్‌.. ఈ ఫొటో ఆమె చిన్న‌ప్ప‌టిది.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

May 1, 2022 10:29 AM

ఎంత పెద్ద సెల‌బ్రిటీలు అయినా.. దిగ్గ‌జ వ్యాపార‌వేత్త‌లు అయినా.. రాజ‌కీయ నాయ‌కులు అయినా స‌రే.. అంద‌రికీ బాల్యం దాదాపుగా ఒకేలా ఉంటుంది. ఆట‌పాట‌లు, అల్ల‌రి చేష్ట‌ల‌తో బాల్యం కొన‌సాగుతుంది. ఆ వ‌య‌స్సులో మ‌నం చేసే అల్ల‌రిని చూసి మ‌న త‌ల్లిదండ్రులు ముచ్చ‌ట ప‌డుతుంటారు. ఇక చిన్న‌త‌నంలో మ‌నల్ని వారు తీయించే ఫొటోల‌ను మ‌నం పెద్ద‌య్యాక చూసుకుంటే.. మ‌న‌కే ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. ఎంత‌లా మారిపోయామో క‌దా అని అనుకుంటారు. ఇక స‌మంత చిన్న నాటి ఫొటోను చూసినా అలాంటి ఆశ్చర్యం క‌ల‌గ‌క‌మాన‌దు.

Samantha childhood photo goes viral

స‌మంత ఎంత అందంగా ఉంటుందో.. ఎంత‌గా అల‌రిస్తుందో అందరికీ తెలుసు. ఈ మ‌ధ్య కాలంలో ఆమె ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తోంది. నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇచ్చిన‌ప్ప‌టి నుంచి స‌మంత‌పై విమ‌ర్శ‌లు ఎక్కువ‌య్యాయి. అగ్నికి ఆజ్యం పోసిన‌ట్లు ఆమె చేసే అందాల ప్ర‌ద‌ర్శ‌న కార‌ణంగా ఆమెపై ట్రోల్స్ మ‌రింత ఎక్కువ‌య్యాయి. దీంతో ఆమె త‌ట్టుకోలేక‌పోతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఒత్తిడిని త‌గ్గించుకునేందుకు ఆమె విహార యాత్ర‌ల‌కు వెళ్తోంది. అందులో భాగంగానే రీసెంట్‌గా ఆమె థాయ్‌లాండ్‌కు వెళ్లి వ‌చ్చింది.

ఇక ఇటీవలే త‌న 35వ జ‌న్మ‌దినాన్ని జ‌రుపుకున్న స‌మంత కొత్త మూవీతో ప‌ల‌క‌రించింది. కాతు వాకుల రెండు కాద‌ల్ అనే సినిమాతో ఈమె ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. కానీ ఈ మూవీ పెద్దగా ఆక‌ట్టుకోలేదు. ఇక త్వ‌ర‌లోనే ఈమె న‌టించిన య‌శోద‌, శాకుంత‌లం అనే సినిమాలు రిలీజ్ కానున్నాయి. ప‌లు వెబ్‌సిరీస్‌ల‌లోనూ ఈమెకు ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. అయితే స‌మంత బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆమె చిన్న‌నాటి ఫొటోను తెగ వైర‌ల్ చేస్తున్నారు. అందులో ఆమె ఎంతో క్యూట్ లుక్స్‌తో ఆక‌ట్టుకుంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment