Niharika Konidela : త‌న‌ను తిట్టిన వాళ్ల‌కు నిహారిక దీటైన స‌మాధానం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ తో మ‌ళ్లీ వ‌చ్చేసింది..!

May 1, 2022 7:53 AM

Niharika Konidela : మెగా డాట‌ర్ కొణిదెల పేరు ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో వినిపిస్తోంది. ఈమె ఉగాది రోజు ప‌బ్‌కు వెళ్లి అర్థ‌రాత్రి వ‌ర‌కు అక్క‌డ ఉండ‌డం ఏమోగానీ.. అంద‌రూ నాగ‌బాబును విమ‌ర్శించారు. డ్ర‌గ్స్ తీసుకోలేదు స‌రే.. అంత రాత్రి పూట భ‌ర్త లేకుండా అది కూడా తెలుగు పండుగ రోజు ఒక తెలుగు యువ‌తి ప‌బ్‌లో ఏం చేస్తుంది ? ఉగాది ప‌చ్చడి తింటుందా ? అని నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు చేశారు. అయితే అది గ‌తం. ఆ సంఘ‌ట‌న త‌రువాత నిహారిక ఇంటికే ప‌రిమితం అయింది. కానీ తాజాగా జిమ్‌లో వ‌ర్క‌వుట్స్ చేస్తూ క‌నిపించింది. ఇక ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ అయింది.

Niharika Konidela given strong reply to those who trolled her
Niharika Konidela

డ్ర‌గ్స్ కేసుకు ముందే నిహారిక త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసింది. ఆమె చివ‌రిసారిగా అందులో ఫిబ్ర‌వ‌రి 27వ తేదీన పోస్ట్ పెట్టింది. అంటే సుమారుగా 2 నెల‌ల అనంత‌రం మళ్లీ అందులో ఆమె తాజాగా ఇప్పుడే పోస్ట్ పెట్టింది. ఇక ఆ పోస్ట్‌లో త‌న లేటెస్ట్ ఫొటోను షేర్ చేయ‌డంతోపాటు దాని కింద ఓ కాప్ష‌న్ కూడా పెట్టింది. తాను 8 వారాల అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లోకి మ‌ళ్లీ వ‌చ్చాన‌ని.. ఈ బ్రేక్ త‌రువాత తాను ఎంతో రీఫ్రెష్‌గా ఫీల‌వుతున్నాన‌ని ఆమె తెలిపింది.

ఈ 8 వారాల ఇన్‌స్టాగ్రామ్ బ్రేక్‌లో తాను 3 పాఠాల‌ను నేర్చుకున్నాన‌ని.. 1. ప్ర‌పంచం అంతం కాలేద‌ని, 2. ఇత‌రులు ఏమ‌న్నా.. ఏం చేసినా తాను ప‌ట్టించుకోన‌ని, 3. ఇప్పుడు కొత్త అనుభూతితో తాజాగా ఫీల‌వుతున్నాన‌ని.. నిహారిక పోస్ట్ చేసింది. దీంతో త‌న‌ను విమర్శించిన వారికి ఆమె ఇలా కౌంట‌ర్ వేసిన‌ట్లు పోస్ట్ పెట్టిందా.. అని నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు. ఇక నిహారిక ప్ర‌స్తుతం ప‌లు వెబ్ సిరీస్‌లు చేస్తోంది. త్వ‌ర‌లోనే అవి విడుద‌ల కానున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment