Manchu Vishnu : ఒళ్లంతా నొప్పులు వ‌చ్చాయ‌న్న మంచు విష్ణు.. ఆచార్య మూవీ గురించేనా..?

April 29, 2022 6:39 PM

Manchu Vishnu : ప్ర‌స్తుతం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో మంచు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. రెండు ఫ్యామిలీల‌ మధ్య వివాదం ఇప్పటిది కాదు. టాలీవుడ్ వజ్రోత్సవ వేడుకల సమయంలో అవార్డుల‌ విషయమై గొడవ జరిగింది. చిరంజీవికి లెజెండరీ పురస్కారం ఇచ్చి, మోహన్ బాబుకు ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆ స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మోహ‌న్ బాబు మధ్య వార్ న‌డిచింది. ఇక అది జ‌రిగి ఏళ్లు కాగా మ‌ధ్య‌లో చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌తో మంచు ఫ్యామిలీ స‌న్నిహితంగానే ఉంది.

Manchu Vishnu tweet is it indirectly on Acharya movie
Manchu Vishnu

ఇటీవ‌ల జ‌రిగిన మా ఎన్నిక‌లు రెండు కుటుంబాల మధ్య మ‌ళ్లీ అగ్గిని రాజేశాయి. మెగా ఫ్యామిలీ మంచు విష్ణు ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేయ‌డంతో అగ్గి రాజుకుంది. మంచు విష్ణు ఓ సంద‌ర్భంలో చిరంజీవి అంకుల్ నన్ను ఎన్నికల నుండి తప్పుకోమన్నారంటూ ఓపెన్ కామెంట్స్ చేశారు. ఇక ఈ ఎన్నికల సమయంలో నాగబాబు, మంచు విష్ణు, మోహన్ బాబుల మధ్య జరిగిన మాటల యుద్ధం పీక్స్ కి వెళ్లిన విష‌యం తెలిసిందే. నాగబాబు ఇటీవ‌ల‌ మోహన్ బాబు సినిమాను ఉద్దేశిస్తూ వ్యంగ్యాస్త్రాలు వదిలారు. తన అభిమానులతో చిట్ చాట్ లో పాల్గొన్న ఆయ‌న కేజీఎఫ్, ఆర్ ఆర్ ఆర్ చిత్రాల్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏది అని అడిగారు. దానికి నాగబాబు రెండూ కాదు ఓ లెజెండరీ గ్రాఫిక్స్ మూవీ.. అంటూ సమాధానం చెప్పారు.

స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా ఒకరిపై ఒక‌రు విమ‌ర్శ‌నాస్త్రాలు వ‌దులుతున్నారు. అయితే తాజాగా విడుద‌లైన ఆచార్య చిత్రం తొలి షో నుండే డివైడ్ టాక్‌తో న‌డుస్తున్న క్ర‌మంలో మంచు విష్ణు ట్వీట్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మంచు విష్ణు తన ట్వీట్‌లో రాస్తూ.. డాన్స్ రిహార్సల్స్ మొదలయ్యాయి. దీంతో ఒళ్ళంతా నొప్పులు.. అంటూ విష్ణు ట్వీట్ చేశారు. మంచు విష్ణు ట్వీట్ చేసే సమయానికి యూఎస్ ప్రీమియర్స్ నుంచి ఆచార్య చిత్రానికి టాక్ మొదలైపోయింది. టాక్ ఆశించిన విధంగా లేదు. మిశ్ర‌మ స్పంద‌న‌ వస్తోంది.. అనే స‌రికి మంచు విష్ణు దానిపై ఇలా సెటైరిక‌ల్ ట్వీట్ చేశార‌ని కొంద‌రు అనుకుంటున్నారు. ప్రస్తుతం మంచు విష్ణు గాలి నాగేశ్వర రావు అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో డాన్స్ గురించే విష్ణు ట్వీట్ చేసి ఉండొచ్చ‌ని.. మ‌రి కొంద‌రు అంటున్నారు. అయితే విష్ణు ఇలా ట్వీట్ చేయ‌డంతో ఆయ‌న ట్వీట్‌ వైర‌ల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment