IPL 2022 : ఐపీఎల్‌లో ఈ ప్లేయ‌ర్ ముఖానికి పెట్టుకుంది ఏమిటో తెలుసా ?

April 26, 2022 10:29 PM

IPL 2022 : ప్ర‌స్తుతం ఐపీఎల్ హంగామా ఏ రేంజ్‌లో సాగుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఫేవ‌రేట్స్‌గా బ‌రిలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్, చెన్నై సూప‌ర్ కింగ్స్ ఇప్ప‌టికే త‌ట్టా బుట్టా స‌ర్ధుకున్నాయి. తాజాగా చెన్నై.. పంజాబ్‌ని ఢీకొన‌గా, మోస్ట్ థ్రిల్లింగ్ ఫైట్‌లో పంజాబ్ గెలిచింది. ముంబైలోని వాంఖెడె స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సూపర్ విక్టరీ కొట్టింది. చివరి ఓవర్ వరకు రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో చెన్నైపై పంజాబ్‌ పైచేయి సాధించింది.

IPL 2022 Rishi Dhawan put on face what is that
IPL 2022

పంజాబ్‌ నిర్ధేశించిన 188 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై 6 వికెట్ల నష్టానికి 176 రన్స్ చేసి 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. తెలుగు తేజం అంబటి రాయుడు (78 నాటౌట్; 39 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (21), ఎంఎస్ ధోనీ (12) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి తొలి మ్యాచ్‌లోనే తన బౌలింగ్‌తో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన రిషి ధ‌వ‌న్ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు. 4 ఓవర్లు వేసి 39 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు.

కాగా మ్యాచ్‌లో రిషి ధావన్‌ ఫేస్‌గార్డ్‌ పెట్టుకొని బౌలింగ్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఫేస్‌గార్డ్‌ వెనుక ఉన్న కథను రిషి ధవన్‌ మ్యాచ్‌ అనంతరం రివీల్‌ చేశాడు. ఐపీఎల్‌ 2022కు ముందు జరిగిన రంజీ ట్రోఫీలో రిషి ధవన్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ చేస్తూ గాయపడ్డాడు. బ్యాట్స్‌మెన్ షాట్‌కి ముక్కు ప‌గిలి ర‌క్తం కారింది. ఆ స‌మ‌యంలో స‌ర్జ‌రీ చేశారు. ఈ క్ర‌మంలో సీజ‌న్ 15 ఆరంభ మ్యాచ్‌ల‌కి హాజ‌రు కాలేదు. ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో ఎవరూ చెప్పలేరు. రిస్క్‌ తీసుకోవడం ఎందుకని సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఫేస్‌గార్డ్‌తో బరిలోకి దిగా. తొలి మ్యాచ్‌లోనే ధోనీ వికెట్‌ పడగొట్టడం సంతోషమనిపించింది. ఓవరాల్‌గా నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నానంటూ.. చెప్పుకొచ్చాడు రిషి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment