Surekha Vani : మ‌ద్యం సేవిస్తూ.. మ‌సాజ్ చేయించుకుంటూ.. కూతురితో సురేఖావాణి ర‌చ్చ ర‌చ్చ‌..!

April 25, 2022 10:52 AM

Surekha Vani : టాలీవుడ్ పాపుల‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌లో సురేఖా వాణి ఒక‌రు. అక్క‌, అత్త‌, అమ్మ ఇలా వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను పోషిస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది. మూడేళ్ల క్రితం సురేఖా వాణి భర్త చనిపోవడంతో ప్ర‌స్తుతం కూతురు సుప్రితతో కలిసి ఉంటోంది. అయితే సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండటంతోపాటు.. పొట్టి పొట్టి డ్రెస్‌‌లతో కూతురికి పోటీగా నిలుస్తున్న సురేఖా వాణి హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ అమ్మ‌డు పొట్టి దుస్తుల‌లో చేసే ర‌చ్చ.. కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. అయితే కొన్నాళ్లుగా సురేఖ మళ్లీ పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వ‌స్తూ ఉన్నాయి.

Surekha Vani vacation with her daughter
Surekha Vani

ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన సుప్రీత త‌న త‌ల్లి రెండో పెళ్లి గురించి మాట్లాడింది. తనకైతే రెండో పెళ్లి చేయాలనే ఉందని చెప్పుకొచ్చింది. ఏం జరుగుతుందో అన్నది టైం డిసైడ్ చేయాలని పేర్కొంది. ప్రస్తుతం తన కెరీర్ పైన అమ్మ ఫోకస్ చేసిందని, ఇప్పుడిప్పుడే సెటిల్‌ అవుతున్నామని వెల్లడించింది. ఇక వీలున్నప్పుడ‌ల్లా విహార యాత్ర‌ల‌కు వెళుతూ అక్క‌డ అప్‌డేట్స్ ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా అందిస్తూ వ‌స్తున్నారు త‌ల్లీ కూతుళ్లు.

క‌రోనా వ‌ల్ల‌ కొన్నాళ్లుగా ఇంటికే ప‌రిమిత‌మైన సురేఖ‌, సుప్రీత తాజాగా బ్యాంకాక్ వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. బిజినెస్ క్లాస్‌లో మందు తాగుతూ, బ్యాంకాక్‌లో మ‌సాజ్ చేసుకుంటూ క‌నిపించారు. ప్ర‌స్తుతం వీరి పిక్స్‌పై నెటిజ‌న్స్ బిన్న‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. సుప్రీత‌ని హీరోయిన్‌గా చేయాల‌ని సురేఖ కోరిక కాగా, అది ఎప్పుడు తీరుతుందో అని ప్ర‌తి ఒక్క‌రూ ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. తన తల్లితో కలిసి సోషల్‌ మీడియాలో గ్లామరస్‌ ఫోటోలతో రచ్చ చేస్తోంది సుప్రీత. వారు ఏ ఫొటో షేర్ చేసినా అది కొద్ది నిమిషాల‌లోనే నెట్టింట వైర‌ల్ అవుతుంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment