Chiranjeevi : సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర చేతులు జోడించింది అందుకే.. స్ప‌ష్టంగా చెప్పిన చిరంజీవి..!

April 24, 2022 7:47 PM

Chiranjeevi : కొన్ని నెల‌ల క్రితం సినీ ప‌రిశ్ర‌మ టిక్కెట్ రేట్స్ త‌గ్గించ‌డం వ‌ల్ల‌ ఎంత‌గా ఇబ్బంది ప‌డిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక‌వైపు క‌రోనాతో జ‌నాలు థియేట‌ర్స్‌కి రావ‌డ‌మే గ‌గ‌నం అన్న ప‌రిస్థితులలో ఏపీ ప్ర‌భుత్వం టిక్కెట్ రేట్స్‌ని భారీగా త‌గ్గించేసింది. ఈ క్ర‌మంలో చాలా మంది నిర్మాత‌లు గ‌గ్గోలు పెట్టారు. అప్పుడు చిరంజీవి ఈ స‌మస్య‌ని త‌న స‌మ‌స్య‌గా తీసుకొని జ‌గ‌న్‌తో చ‌ర్చించారు. టికెట్ రేట్ల సమస్యను పరిష్కరించాలని చిరంజీవి సీఎం జగన్ దగ్గర చేతులు జోడించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు రావ‌డంతో దీనిపై అనేక మంది అనేక ర‌కాలుగా మాట్లాడారు.

Chiranjeevi said why he was bowed to CM YS Jagan
Chiranjeevi

చిరంజీవిని జ‌గ‌న్ దారుణంగా కించపరిచారని తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. లేని సమస్యలను సృష్టించి.. మళ్లీ తానే తీర్చేసినట్లుగా సినిమా హీరోలను ఘోరంగా అవమానించారని పేర్కొన్నారు. సీఎం జగన్‌కు రెండు చేతులు జోడించి తమ సమస్యలు ఏకరువుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి గురించి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వశక్తితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు సీఎం జగన్‌ను ఇంతలా ప్రాధేయపడాలా అని చంద్రబాబు ఆక్షేపించారు. ప‌లువురు నిర్మాత‌లు కూడా ఈ విష‌యంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అయితే చిరంజీవి న‌టించిన ఆచార్య మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన చిరంజీవి ఈ సినిమాకు సంబంధించిన విశేషాలతోపాటు ఇతర విషయాలను కూడా పంచుకున్నారు. ఈ సినిమాలో తన పాత్రకు, చరణ్ పాత్రకు మధ్య ఎలాంటి బంధం ఉండదని అయితే ప్రేక్షకులు తెరపై ఆ బంధాన్ని ఫీలవుతారని చిరంజీవి కామెంట్లు చేశారు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలతోపాటు మరో ఐదు సినిమాలు సిద్ధంగా ఉన్నాయని చిరంజీవి తెలిపారు. ఇండస్ట్రీ సమస్యలను తాను చేతులు జోడించి వివరించానని అలా చేయడం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అర్థమైందని చిరంజీవి చెప్పుకొచ్చారు. అలా చేయ‌డం నా ఒక్క‌డి కోసం అయి ఉంటే సిగ్గుప‌డే వాడిన‌ని, లక్షల మంది సమస్యను పరిష్కరించడానికి భగవంతుడు ఇచ్చిన అవకాశం అని తాను భావిస్తానని ఆయన వెల్లడించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now