Taapsee : తాప్సీ ఇంత స‌న్న‌గా మార‌డం వెనుక ఉన్న అస‌లు సీక్రెట్ ఏమిటంటే..?

April 24, 2022 1:52 PM

Taapsee : సొట్ట‌బుగ్గ‌ల సుందరి తాప్సీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ముందు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో అదృష్టం ప‌రీక్షించుకుంది. ఝుమ్మంది నాదం చిత్రంతో సినీరంగంలోకి ఎంట్రి ఇచ్చిన తాప్సీ మొద‌టి సినిమాతోనే మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం విజ‌యంతో ఈమెకు భారీగా అవ‌కాశాలు వ‌చ్చాయి. కానీ అవి అంత గుర్తింపు తీసుకురాని పాత్ర‌లే. ఆ త‌రువాత ఈమెకు టాలీవుడ్‌లో క్ర‌మంగా అవ‌కాశాలు త‌గ్గుతూ వ‌చ్చాయి. దాంతో ఈమె బాలీవుడ్‌కు షిఫ్ట్ అయింది.

do you know about Taapsee weight loss secret
Taapsee

బాలీవుడ్‌లో తాప్సీ గోల్డెన్ లెగ్‌గా మారింది. చేసిన ప్ర‌తి సినిమా హిట్టే. ఈమె న‌టించిన ప్ర‌తి సినిమా కొత్త‌గా ఉండ‌టంతోపాటు తాప్సీ త‌న‌దైన న‌ట‌న‌తో బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. అయితే ఒక‌ప్పుడు బొద్దుగా ఉన్న తాప్సీ ఇప్పుడు చాలా స్లిమ్‌గా మారింది. దీని వెనుక చాలా క‌ష్టం ఉంటుందని ఆమె తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పింది. ఒకప్పుడు రోజుకు రెండుసార్లు భోజనం చేసేదాన్ని. ప్రస్తుతం ఐదారుసార్లు కొద్దికొద్దిగా తింటున్నా. ప్రతిసారీ ఒకే మోతాదులో తీసుకోవ‌డం వ‌ల‌న చాలా మార్పులు వ‌చ్చాయి. బ్రేక్‌ఫాస్ట్‌లో దక్షిణాది ఇడ్లీ సాంబార్ త‌ప్ప‌క ఉంటుంది.

లంచ్‌లో రోటీ, దాల్‌, సబ్జీ, పెరుగు. ఎండాకాలం కాబట్టి కోకోనట్‌ షేక్‌ విత్ మల‌య్ ఉంటుంది . స్నాక్స్‌గా నట్స్‌ తీసుకుంటా. రాత్రికి కిచిడి, సుషి, ఫిష్‌, థాయ్‌ కర్రీ.. ఇదీ నా మెనూ. అయితే రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లానే ఉండు.. అనే పద్ధతిని నేను త‌ప్ప‌క పాటిస్తాను. ఎక్కడికెళితే అక్కడి వంటకాలను టేస్ట్‌ చేస్తాను. లక్నో వెళితే చాట్‌, మటన్‌ ఆరగించాల్సిందే. జైపూర్‌ వెళితే దాల్‌ బాటీతో దోస్తీ చేస్తా. ప్ర‌తి రోజూ వర్కవుట్స్ మాత్రం త‌ప్ప‌క చేస్తాను. సంప్ర‌దాయ వంట‌కాలు మాత్ర‌మే మ‌న ఆరోగ్యానికి మంచిద‌ని నేను విశ్వ‌సిస్తున్నాను.. అని తాప్సీ అంటుంది. తాప్సీ గ‌త కొంత కాలంగా ప్ర‌ముఖ బ్య‌డ్మింట‌న్ ఆట‌గాడు మాథియాస్‌తో ప్రేమ‌లో ఉంది. వీరి పెళ్ళికి ఇరు కుటుంబ స‌భ్యులు ఒప్పుకున్నార‌ట‌. అంతే కాకుండా వీరి పెళ్ళికి ముహూర్తం కూడా ఖ‌రారయినట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే అధికారికంగా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment