Samantha : నాగ‌చైత‌న్య ఫ్యాన్స్‌కు స‌మంత వార్నింగ్‌..!

April 23, 2022 8:47 AM

Samantha : అక్కినేని నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి సమంత ఆయ‌న ఫ్యాన్స్ నుంచి ఏదో ఒక విధంగా విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటూనే వ‌స్తోంది. స‌మంత క్యారెక్ట‌ర్ మంచిది కాదని.. ఆమె డ‌బ్బే ప‌ర‌మావ‌ధిగా జీవిస్తుంద‌ని.. ఆమెకు పిల్ల‌ల్ని క‌న‌డం ఇష్టం లేద‌ని.. ఆమె చేసే గ్లామ‌ర్ షో వ‌ల్లే ఆమెకు చైత‌న్య విడాకులు ఇచ్చాడ‌ని.. ఇలా ర‌క‌ర‌కాలుగా విమ‌ర్శ‌లు చేస్తూ స‌మంత‌ను అక్కినేని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. సందు దొరికిన‌ప్పుడ‌ల్లా ఆమెపై మీమ్స్ చేస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఇవి త‌గ్గినా.. తాజాగా కాజ‌ల్ అగ‌ర్వాల్ కొడుక్కి జ‌న్మ‌నివ్వ‌డంతో ఆమెను సాకుగా చూపి మ‌రోమారు స‌మంత‌ను విమ‌ర్శించ‌డం మొదలు పెట్టారు.

Samantha indirect warning to Naga Chaitanya fans
Samantha

కాజ‌ల్ అగర్వాల్‌ను బంగారంతో పోల్చిన అక్కినేని ఫ్యాన్స్‌.. ఆమె పెళ్ల‌యిన ఏడాదిలోపే బిడ్డ‌ను క‌న‌డాన్ని అభినందించారు. అస‌లైన ఇల్లాలు అంటే ఇలాగే ఉండాల‌ని వారు కాజ‌ల్‌ను మెచ్చుకుంటున్నారు. అలాగే ప‌నిలో ప‌నిగా స‌మంత‌ను ఇన్‌డైరెక్ట్‌గా తిడుతున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ నిజంగా బంగార‌మే.. పెళ్ల‌యిన ఏడాదిలోపే బిడ్డ‌ను క‌న్న‌ది.. కానీ కొంద‌రు ఉంటారు.. వారు కుక్క‌ల‌కు ఇచ్చిన విలువ భర్త‌కు ఇవ్వ‌రు.. వాళ్ల‌కు కుక్క‌లే కావాలి.. మొగుడు అక్క‌ర్లేదు.. అని ఇన్‌డైరెక్ట్‌గా స‌మంత‌పై మీమ్స్ చేస్తున్నారు. దీంతో సోష‌ల్ మీడియాలో ఇవి గ‌త 2, 3 రోజుల నుంచి వైర‌ల్ అవుతున్నాయి.

అయితే నాగ‌చైత‌న్య ఫ్యాన్స్ నుంచి వ‌స్తున్న ఈ విమ‌ర్శ‌ల‌కు స‌మంత ప‌రోక్షంగానే కౌంట‌ర్ ఇచ్చింది. తాను మౌనంగా ఉన్నాన‌ని దాన్ని త‌న చేత‌గానిత‌నం కింద భావించ‌వ‌ద్ద‌ని.. త‌న మౌనాన్ని అంగీకారం అనుకోవ‌ద్ద‌ని.. త‌న జాలి, ద‌య‌ను త‌న బ‌ల‌హీన‌త అనుకోవ‌ద్ద‌ని.. స‌మంత ట్వీట్ చేసింది. దీంతో ఆమె ట్వీట్ వైర‌ల్‌గా మారింది. ఆమె ఇన్‌డైరెక్ట్‌గా చేసిన‌ప్ప‌టికీ ఆ ట్వీట్ చైతూ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి చేసిందేన‌ని స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. అయితే విడాకుల అనంత‌రం నాగ‌చైత‌న్య క‌న్నా స‌మంత‌ను విమ‌ర్శించే వారే ఎక్కువ‌గా ఉండ‌డం విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment