Dimple Hayathi : ఖిలాడి బ్యూటీ ప‌రిస్థితి ఏమిటి ? అనుకున్న‌ది ఒక‌టి.. అయిన‌దొక‌టి..!

April 22, 2022 10:46 PM

Dimple Hayathi : మ‌నం అనుకున్న‌వి అనుకున్న‌ట్లు జ‌ర‌గాల‌ని దేవున్ని కోరుకుంటుంటాం. అలాంట‌ప్పుడు మ‌నం కోరుకున్న‌వి కోరుకున్న‌ట్లు జ‌ర‌గాలే కానీ.. ఇక మ‌న ఆనందానికి హ‌ద్దులు ఉండ‌వు. కానీ ఆశించిన‌వి జ‌ర‌గ‌క‌పోతే మాత్రం నిరాశ త‌ప్ప‌దు. తీవ్ర విచారం క‌లుగుతుంది. బ్యాడ్ ల‌క్ అంతా మ‌న ద‌గ్గ‌రే ఉందా.. అన్న‌ట్లు అనిపిస్తుంది. ప్ర‌స్తుతం ఖిలాడి బ్యూటీ డింపుల్ హ‌య‌తి పరిస్థితి కూడా ఇలాగే ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఎందుకంటే.. ఆమె అనుకున్న‌ది జ‌ర‌గ‌లేదు మ‌రి..!

Dimple Hayathi is not getting any movie chances
Dimple Hayathi

మాస్ మ‌హ‌రాజ ర‌వితేజ‌, డింపుల్ హ‌య‌తి, మీనాక్షి చౌదరిలు హీరో హీరోయిన్లుగా వ‌చ్చిన ఖిలాడి మూవీ ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. ర‌వితేజ జాబితాలో ఇంకో ఫ్లాప్ మూవీ చేరిన‌ట్లు అయింది. అయితే ఇత‌రుల ప‌రిస్థితి ఎలా ఉన్నా ఈ మూవీ హిట్ అవుతుంద‌ని ఆశించిన డింపుల్‌కు మాత్రం నిరాశ తప్ప‌లేదు. ఈ మూవీ క‌నీసం హిట్ కాక‌పోయినా.. త‌న అందాల ప్ర‌ద‌ర్శ‌న చూసి అయినా ఆఫ‌ర్లు వ‌స్తాయేమోన‌ని అనుకుంది. కానీ అనుకున్న‌వి అనుకున్న‌ట్లు జ‌రిగితే.. ఇక లేనిదేముంది. అలా జ‌ర‌గ‌దు క‌దా.. క‌నుక డింపుల్ హ‌య‌తి విష‌యంలోనూ అలాగే జ‌రిగింది. సినిమా హిట్ కాక‌పోయినా.. త‌న గ్లామ‌ర్ షో తో అయినా ఆఫ‌ర్లు వ‌స్తాయ‌ని ఆశించింది. కానీ ఆమె కోరుకుంది జ‌ర‌గ‌లేదు.

సినిమాలో లిప్ లాక్ సీన్లు, బికినీ సీన్ల‌తోపాటు మూవీ ప్రెస్ మీట్‌లోనూ డింపుల్ హ‌య‌తి భారీగానే అందాల‌ను ఆర‌బోసింది. అయిన‌ప్ప‌టికీ ఈమెకు నిరాశే ఎదుర‌వుతోంది. ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా ఈమెకు ఆఫ‌ర్ల‌ను ఇవ్వ‌డం లేదు. అయితే ముందు ముందు ఏమైనా ప‌రిస్థితిలో మార్పు వ‌స్తుందేమో చూడాలి. మ‌రోవైపు ఈమె విశాల్‌తో న‌టించిన సామాన్యుడు కూడా నిరాశ ప‌రిచింది. దీంతో మ‌రిన్ని ఆఫ‌ర్ల కోసం ఈమె ఎదురు చూస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment