Vijay Devarakonda : స‌మంత‌ను అలా పెట్టి ఆ ఫొటోను షేర్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. దానికి స‌మంత రియాక్ష‌న్ ఏమిటంటే..?

April 22, 2022 7:19 PM

Vijay Devarakonda : టాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ స‌మంత ప్ర‌స్తుతం ప‌లు వ‌రుస సినిమాల‌తో ఎంతో బిజీగా ఉంది. ఆమె న‌టిస్తున్న సినిమాలో ఈ ఏడాదిలో వ‌రుస‌గా విడుద‌ల కానున్నాయి. అయితే అంత బిజీగా ఉంటూ కూడా స‌మంత వెకేష‌న్ల‌లో తెగ ఎంజాయ్ చేస్తోంది. ప్ర‌స్తుతం ఆమె థాయ్‌లాండ్ లో విహ‌రిస్తోంది. అక్క‌డి ఓ రెస్టారెంట్‌లో గ్లామ‌ర‌స్‌గా దిగిన ఫొటోల‌ను ఆమె షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. అయితే స‌మంత‌కు చెందిన ఓ ఫొటోను విజ‌య్ దేవ‌ర‌కొండ మార్ఫింగ్ చేసి ట్వీట్ చేశాడు. దీంతో ఆ ఫొటో కూడా వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

Vijay Devarakonda shared samantha fake photo viral
Vijay Devarakonda

విజ‌య్ దేవ‌రకొండ‌, సమంత‌.. హీరో హీరోయిన్లుగా మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసిన విష‌యం విదిత‌మే. అయితే ఈ పూజ కార్య‌క్ర‌మానికి హీరోయిన్ స‌మంత హాజ‌రు కాలేదు. ఆమె వెకేష‌న్‌లో ఉన్నందున కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాలేక‌పోయింది. దీంతో లోకులు ప‌లు కాకులు అన్న‌ట్లు మీడియా మొత్తం కోడై కూసింది. అస‌లు ఆమె పూజ‌కు ఎందుకు వెళ్లలేదు.. హీరోయిన్‌గా అంత పొగ‌రు పెరిగిపోయిందా.. పూజ కార్య‌క్ర‌మానికి కూడా హాజ‌రు కానంత బిజీ అయిందా.. అంటూ ఆమెను ట్రోల్ చేశారు. అయితే అన్నింటికీ చెక్ పెట్టేలా విజ‌య్ ఓ ఫొటోను షేర్ చేశాడు.

పూజ కార్య‌క్ర‌మానికి చెందిన ఫొటోలో స‌మంత‌ను చేర్చి విజ‌య్ ఆ ఫొటోను మార్ఫింగ్ చేశాడు. అనంత‌రం దాన్ని ట్వీట్ చేశాడు. దానికి స‌మంత కూడా రియాక్ట్ అయింది. ఆమె ప‌డి ప‌డి న‌వ్విన‌ట్లు ఉన్న ఎమోజీల‌ను షేర్ చేసింది. అంతేకాదు ఈ మూవీలో న‌టిస్తున్న వెన్నెల కిషోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌లు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌లేదు. దీంతో వారి ఫొటోల‌ను కూడా విజ‌య్ ఇందులో మార్ఫింగ్ చేశాడు. దీంతో ఈ ఫొటో వైరల్‌గా మారింది. మీడియాకు భ‌లే చుర‌క‌లు అంటించారు.. అని విజ‌య్ ఫ్యాన్స్ అభినందిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment