Yashika Anand : బ్లూ డ్రెస్‌లో అందాలు ఆర‌బోస్తూ మ‌త్తెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..!

April 22, 2022 3:05 PM

Yashika Anand : చావు దగ్గ‌ర వ‌ర‌కు వెళ్లి తృటిలో బ‌య‌ట‌ప‌డ్డ అందాల ముద్దుగుమ్మ య‌షికా ఆనంద్. ఈ అమ్మ‌డు విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న నోటా అనే చిత్రంలో న‌టించింది. ఈ సినిమా హిట్ కాక‌పోవ‌డంతో ఈ అమ్మ‌డికి తెలుగులో ఆఫ‌ర్స్ పెద్ద‌గా ద‌క్క‌డం లేదు. ఢిల్లీలో పుట్టి.. చెన్నైలో సెటిలైంది. ఫ్యాషన్ మోడల్‌, టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ పంజాబీ ఫ్యామిలీ నటి.. 2016లో ధురువంగల్ పత్తినారు సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత 2018లో అడల్ట్ కామెడీ, ఇరుట్టు అరైయిల్ మురట్టు సినిమాలతో క్రేజీ స్టార్ అయిన యషికా.. 2019లో కఝుగు 2, జాంబీ సినిమాలతో పలకరించింది. అలాగే బిగ్ బాస్ 3 తమిళ్ సిరీస్‌లో కూడా ఎంట్రీ ఇచ్చి.. బుల్లితెరపై సందడి చేసింది.

Yashika Anand latest blue colour dress photos viral
Yashika Anand

కొద్ది నెల‌ల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సినీ హీరోయిన్ యాషికా ఆనంద్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆమె గత మూడు నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందింది. జూలై 24న జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో నటి యాషికా ఆనంద్‌‌‌కి తీవ్ర గాయాలయ్యాయి. అదే ప్రమాదంలో ఆమె స్నేహితురాలు పావని మృతి చెందింది. ఈ క్ర‌మంలో తాను డ్రైవింగ్ చేయ‌న‌ని చెప్పుకొచ్చింది. అయితే సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే య‌షికా ఎప్ప‌టిక‌ప్పుడు అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తుంటుంది.

తాజాగా య‌షికా త‌న ఎద అందాలు చూపిస్తూ బ్లూ క‌ల‌ర్ డ్రెస్‌లో నానా ర‌చ్చ చేసింది. య‌షికా అంద‌చందాల‌కు కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే యషికా తన విషయాలను ఫాలోవర్స్ తో ఎప్పటికప్పుడూ పంచుకుంటూ వస్తోంది. తాజాగా తన లేటెస్ట్ ఫొటో షూట్ లోని కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. ఆ లుక్స్ తో నెటిజన్లకు చెమట‌లు పట్టిస్తోంది యషికా.స్టార్ హీరోయిన్‌గా ఎదిగే స‌త్తా య‌షికాకి ఉంద‌ని.. మంచి ఆఫ‌ర్స్ వ‌స్తే తానేంటో నిరూపించుకుంటానంటోంది ఈ అమ్మ‌డు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment