మే 26న తొలి చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్త!

May 24, 2021 10:24 PM

సాధారణంగా ఈ విశ్వంలో సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడటం సర్వసాధారణం. ఈ విధంగా గ్రహణాలు ఏర్పడే సమయంలో కొన్ని రాశులలో మార్పులు చెందుతాయి. అయితే ఈ ఏడాది మన దేశంలో మొట్టమొదటి చంద్రగ్రహణం మే 26వ తేదీన ఏర్పడనుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ చంద్రగ్రహానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంతోపాటు అమెరికా, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాలలో కల్పించనుంది.

భారత దేశంలో కొన్ని ప్రాంతాలలో పాక్షిక చంద్ర గ్రహణాన్ని చూడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ చంద్రగ్రహణం రోజున వైశాఖ పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి కావటం వల్ల ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం వృశ్చిక రాశిలో జరగనుంది. దీంతో ద్వాదశ రాశుల వారిపై ఈ చంద్రగ్రహణ ప్రభావం పడనుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.

వృశ్చిక రాశిలో చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల మేష రాశి, కర్కాటకం, సింహరాశి, తులారాశి, కుంభరాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రాశి వారు గ్రహణం రోజు ఎవరితోనూ వివాదాలకు దిగకుండా, ఎటువంటి కొత్త కార్యక్రమాలను చేపట్టకుండా, ఏదైనా కొత్త పెట్టుబడులు పెట్టడం కానీ చేయకూడదు. వీలైనంత వరకు చంద్ర గ్రహణం రోజు ఈ రాశి వారు ఇంట్లోనే ఉంటూ వారి ఇష్ట దైవాన్ని ప్రార్థించడం ఎంతో మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment