పచ్చి మామిడి కాయ పచ్చడి తయారీ విధానం..

May 23, 2021 12:21 PM

వేసవికాలం వచ్చిందంటే పచ్చిమామిడికాయలు తినడానికి ఎంతో ఇష్టపడతారు. ఈ క్రమంలోనే పచ్చి మామిడి కాయలతో తయారు చేసే పచ్చడి అంటే ప్రతి ఒక్కరు లొట్టలేసుకుంటూ తింటారు. ఎంతో రుచికరమైన పచ్చి మామిడికాయ పచ్చడి తయారు చేయడం ఏ విధంగానో ఇక్కడ తెలుసుకుందాం…

కావలసిన పదార్థాలు

*పచ్చి మామిడికాయ ఒకటి

*నాలుగు ఎండుమిర్చి

*టేబుల్ స్పూన్ జీలకర్ర

*ఉప్పు తగినంత

*కరివేపాకు

*ఆవాలు

*వెల్లుల్లి రెబ్బలు

*ఉల్లిపాయ ముక్కలు

*నూనె

తయారీ విధానం

ముందుగా పచ్చి మామిడికాయను పైన తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టౌ పై కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి కరివేపాకు రెమ్మ జీలకర్ర 3 ఎండు మిరపకాయలు వేసి దోరగా వేయించాలి. మామిడికాయ ముక్కలు, వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీలో కాకుండా, రోటిలో మెత్తగా రుబ్బుకోవాలి.

మరొక కడాయిలో వేసి పోపు కోసం కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు, కరివేపాకు, ఎండు మిర్చి ముక్కలు, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఆవాలు చిటపట అన్న తరువాత ముందుగా రుబ్బి పెట్టుకున్న మామిడికాయ పచ్చడిని ఆ కడాయిలో వేసి రెండు నిమిషాల పాటు సిమ్లో ఉడకనివ్వాలి. ఈ విధంగా మామిడికాయ పచ్చడిని ఉడికించడం వల్ల పచ్చి వాసన రాదు.రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన మామిడికాయ పచ్చడి తయారైనట్లే.ఈ మామిడికాయ పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment