Nikesha Patel : ప‌వన్ క‌ళ్యాణ్ హీరోయిన్.. చిరంజీవిని ఇంత‌లా అవ‌మానించింది ఏంటి ?

April 18, 2022 5:04 PM

Nikesha Patel : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన కొమరం పులి సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ నికిషా ప‌టేల్. ఈ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర నిరాశపర‌చ‌డంతో నికిషాకు తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. ఫలితంగా కొమరం పులి తర్వాత ఆమె మళ్లీ తెలుగు సినిమాల‌లో కనిపించనేలేదు. తాజాగా ఆమె సోషల్‌ మీడియాలో అభిమానులతో సంభాషించింది. నెటిజన్లు అడిగే పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ప్రభాస్ తనకు ఫ్రెండ్ అని, తనకంటే చాలా పొడుగ్గా ఉన్నాడంటూ తెలిపింది. ఇక మహేష్ బాబు గురించి ఒక్క మాటలో చెప్పమని అనగా.. ఫెయిర్ అండ్ లవ్లీ.. అని చెప్పేసింది.

Nikesha Patel insulted Chiranjeevi mega fans angry
Nikesha Patel

పవన్ కళ్యాణ్ బియర్డ్ లుక్ అదిరిపోయిందని చెప్పుకొచ్చింది. అయితే ఓ మెగా అభిమాని మాత్రం చిరంజీవి గురించి చెప్పమని అడిగాడు. ఆ ట్విట్టర్ హ్యాండిల్ పేరు కూడా జై చిరంజీవి అని ఉంది. మెగాస్టార్ గురించి వన్ వర్డ్‌లో చెప్పండి అని ఆ నెటిజన్ అడిగాడు. ఏ మెగాస్టార్ గురించి చెప్పాలి.. చాలా మంది మెగాస్టార్లున్నారు.. అని అనేసింది. అయితే లండన్ వెళ్లిపోయినా, టాలీవుడ్ తో రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటోంది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో చాట్ చేస్తుంది. హీరోల పుట్టినరోజులకు శుభాకాంక్షలు కూడా చెబుతుంది. ఈ క్రమంలో పెళ్లెప్పుడు చేసుకుంటావ్.. అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు త్వరలోనే.. అంటూ సమాధానం ఇచ్చింది.

నికిషా యూకేలోనే పుట్టి పెరిగింది. పేరెంట్స్ ఇండియన్స్ అయినా యూకేలో సెటిల్ అయింది. తనకి యూకే పౌరసత్వం కూడా ఉంది. దీంతో ఇప్పుడు యూకే అబ్బాయిని చేసుకుంటాను.. అని చెప్పడంతో అంద‌రు షాక్ అయ్యారు. అయితే ఈ అమ్మడికి సినిమాల్లో చాన్సులు రావట్లేదని చెప్పి.. పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన నీకు మెగాస్టార్ ఎవరో తెలీదా ? అంటూ మెగా ఫ్యాన్స్‌ ఫైర్ అవుతున్నారు. అయితే నికిషా అభిమానులు మాత్రం.. చిరు, మమ్ముట్టి, సల్మాన్ ఖాన్ లు కూడా మెగాస్టార్లే.. వారిలో ఎవరి గురించి అని అడిగింది.. అంటూ ఆమెను వెనకేసుకొస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment