Apsara Rani : ఆర్జీవీ శిల్పం అప్స‌రా రాణి.. అందాల‌తో మ‌తులు పోగొడుతుందిగా..!

April 17, 2022 7:24 PM

Apsara Rani : కాంట్ర‌వ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ ఇటీవ‌లి కాలంలో క్రియేట్ చేస్తున్న‌సెన్సేష‌న్స్ అన్నీ ఇన్నీ కావు. వ‌ర్మ ఇండ‌స్ట్రీకి చాలా మంది అందాల ముద్దుగుమ్మ‌లని ప‌రిచ‌యం చేసిన విష‌యం తెలిసిందే. అందులో హాట్ బ్యూటీగా మారింది అప్స‌రా రాణి. 2019లోనే ఇండస్ట్రీకి వచ్చినా ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ రామ్‌గోపాల్ వర్మ మూవీ థ్రిల్లర్ ద్వారా యూత్‌కు దగ్గరయింది ఈ బ్యూటీ. రవితేజ మూవీ క్రాక్‌లో ఐటమ్ సాంగ్ చేసి తన అందచందాలతో అదరగొట్టింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తన ఫోటోలతో కుర్రకారు టెంపరేచర్ పెంచుతోంది.

Apsara Rani latest photos trending and viral
Apsara Rani

తాజాగా అప్స‌రా రాణి కేక పెట్టించే అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతోంది. నిషా క‌ళ్ల‌తో కైపెక్కించే విధంగా అప్స‌రా రాణి ఫొటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం అప్స‌రా రాణి స్ట‌న్నింగ్ పిక్స్ నెటిజ‌న్స్ మ‌తులు పోగొడుతున్నాయి. అప్స‌రా రాణి క్యూట్ పిక్స్ చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. అప్స‌రా అస‌లు పేరు అంకిత మహారాణా.. ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ అప్సర రాణిగా సినీ ప్రియులకు సుపరిచతం. 4 లెటర్స్, ఊలాలా ఊలాలా సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు. కానీ ఆర్జీవీ థ్రిల్లర్ మూవీలో నటించి కుర్రకారు గుండెల్లో సెగలు రేపింది అప్సర. త్వరలో రానున్న డేంజరస్ మూవీలో కూడా అందాలను ఆర‌బోసింది ఈ భామ.

క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఎంతో మంది నటీమణుల జీవితాలు అర్థాంతరంగా ఆగిపోయాయి. అయినా కూడా చాలా మంది ఈ క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించకుండా మౌనంగా ఉండిపోయారు. కానీ మీటూ అనే మూమెంట్ వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చాలామంది క్యాస్టింగ్ కౌచ్ తో తాము ఏ విధంగా నష్టపోయారో బయటపెట్టారు. అప్సర రాణి కూడా ఇటీవ‌ల తాను ఎదుర్కొన్న ప‌రిస్థితులు వివ‌రించింది. కన్నడలో ఓ సినిమాలో అప్సరకు హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చిందట. అయితే ఆ సినిమా స్టోరీ డిస్కషన్ కోసం డైరెక్టర్ ఒంటరిగా రూమ్‌కు రమ్మన్నాడన్న విషయం బయటపెట్టింది ఈ భామ. తీరా అక్కడికి వెళ్లాక తన కోరిక తీరిస్తేనే హీరోయిన్ ఛాన్స్ అని బెదిరించాడట. కానీ తన తండ్రితో అక్కడికి వెళ్లిన అప్సర.. వెంటనే పారిపోయి వచ్చేసిందట. తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తనకు అలాంటి అనుభవాలు ఏమీ ఎదురుకాలేదని పేర్కొంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment