Ghani Movie : అప్పుడే గ‌ని సినిమా ఓటీటీలోకి వ‌చ్చేస్తుందా.. షాక్ అవుతున్న సినీ వ‌ర్గాలు..

April 17, 2022 2:43 PM

Ghani Movie : మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కెరీర్‌లో మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఒక్కోసారి క‌థ‌ల ఎంపిక‌లో నిర్ల‌క్ష్యం వ‌హించ‌డం వ‌ల్ల‌ ఫ్లాపులు మూట‌గ‌ట్టుకుంటున్నాడు. బాక్సింగ్‌ నేపథ్యంలో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ చిత్రం గని. ఈ సినిమాను కొత్త దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి డైరెక్ట్ చేశారు. అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈనెల 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. నదియా, జగపతిబాబు, సునీల్‌ శెట్టి, ఉపేంద్ర ఇతర కీలకపాత్రల్లో కనిపించారు.

Ghani Movie releasing very soon on Aha OTT platform
Ghani Movie

భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా అభిమానుల‌ని చాలా నిరాశ‌ప‌రిచింది. ఈ నేపథ్యంలో గని ఫలితంపై వరుణ్ తేజ్ ఎమోషన్ అవుతూ ఓ పోస్ట్ కూడా పెట్టారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కి సిద్ధమైంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా కొనుగోలు చేసింది. ఈ చిత్రం ఏప్రిల్ 22న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా విడుదల తేదీని ప్రకటించారు. ఓటీటీలో అయినా ఈ సినిమాకి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుందా.. అనే చూడాలి.

గని సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ బిజినెస్ లో పెట్టుబడి రాలేదు. అయితే గని సినిమా ఇప్పటికే డిజిటల్, శాటిలైట్ హక్కులు కూడా రూ.20 కోట్లకు పైగా అమ్మేసినట్టు సమాచారం. ఈ లెక్కన ప్రీ రిలీజ్ బిజినెస్, డిజిటల్, శాటిలైట్ అన్నీ కలిపితే గని సినిమా నిర్మాతలు లాభాల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు రూ.25.3 కోట్లలో రేంజ్ బిజినెస్ జరగగా.. రూ.26.30 కోట్ల రేంజ్‌టార్గెట్‌తో బరిలోకి దిగింది. కాగా ఈ సినిమా మొదటి రోజు నుంచే ట్రాక్ తప్పింది. ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ మూవీ ఇంత త్వ‌ర‌గా ఓటీటీలోకి వ‌స్తుండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment