Abhay Ram : ఎన్‌టీఆర్ కొడుక్కి ఆ హీరో అంటే చాలా ఇష్టం.. ఇంత‌కీ ఎవ‌రా హీరో..?

April 17, 2022 7:57 AM

Abhay Ram : సాధార‌ణ ప్రేక్ష‌కుల‌కు ఎవ‌రో ఒక అభిమాన హీరో ఉంటాడు. ఒక్కొక్క‌రు ఒక్కో హీరోను ఇష్ట‌ప‌డుతుంటారు. ఇక కొంద‌రికి కొంద‌రు హీరోలంటే ఎక్కువ‌గా న‌చ్చుతారు. అయితే సెల‌బ్రిటీల‌కు ఎవ‌రంటే ఇష్టం ? అనే విష‌యం తెలుసుకోవాల‌ని వారి ఫ్యాన్స్‌కు ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఎన్‌టీఆర్ కుమారుడు అభ‌య్ రామ్ కూడా త‌న‌కు ఏ హీరో అంటే ఇష్ట‌మో తేల్చి చెప్పేశాడు. ఈ క్ర‌మంలో ఆ చిన్నారి స‌మాధానం విని అంద‌రూ షాక‌య్యారు. త‌న తండ్రి పేరు చెబుతాడ‌ని అనుకుంటే.. అభ‌య్ రామ్ మాత్రం వేరే హీరో పేరు చెప్పేశాడు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

do you know about NTR son Abhay Ram favourite actor
Abhay Ram

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించి రికార్డుల వేట‌ను కొన‌సాగిస్తోంది. అయితే మూవీ హిట్ అయిన కార‌ణంగా చిత్ర యూనిట్ పార్టీ నిర్వ‌హించింది. ఈ వేడుక‌కు చిత్ర న‌టీన‌టులు, సిబ్బంది అంద‌రూ హాజ‌ర‌య్యారు. ఇక ఎన్‌టీఆర్‌తోపాటు ఆయ‌న కుమారుడు అభయ్ రామ్ కూడా హాజ‌ర‌య్యాడు.

అయితే పార్టీ సంద‌ర్భంగా ఒకానొక స‌మ‌యంలో నీ ఫేవరెట్ హీరో ఎవ‌రు ? అని అభ‌య్ రామ్‌ను అడగ్గా.. అందుకు అత‌ను త‌న ఫేవరెట్ హీరో మ‌హేష్ బాబు అని.. ఆయ‌న న‌టించిన బిజినెస్‌మ్యాన్ సినిమా త‌న‌కు బాగా న‌చ్చుతుంద‌ని చెప్పాడు. దీంతో అంద‌రూ అవాక్క‌య్యారు. అభ‌య్ రామ్ త‌న తండ్రి ఎన్‌టీఆర్ పేరు చెబుతాడ‌ని అంద‌రూ భావించారు. కానీ అత‌ను మ‌హేష్ బాబు పేరు చెప్ప‌డంతో.. అంద‌రూ షాక‌య్యారు. ఇక అభ‌య్ రామ్ స‌మాధానం విని ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌తోపాటు మ‌హేష్ బాబు ఫ్యాన్స్ కూడా తెగ సంబ‌రప‌డిపోతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now