Payal Rajput : మ‌ద్యం సేవిస్తే త‌ప్పేముంది ? స‌మ‌ర్థించుకున్న పాయ‌ల్ రాజ్ పూత్‌..!

April 16, 2022 6:04 PM

Payal Rajput : పాయ‌ల్ రాజ్‌పూత్‌.. ఈ మ‌ధ్య కాలంలో ఈ అమ్మ‌డు త‌రచూ వార్త‌ల్లో నిలుస్తోంది. గ‌తంలో ఒక‌సారి ఈమె ఎల్లో క‌ల‌ర్ బ్రేజ‌ర్ ధ‌రించి చూపించ‌కూడ‌ని అందాల‌ను చూపించింది. జ‌రిగిన పొర‌పాటుకు చింతిస్తూ ఆ పోస్ట్‌ను డిలీట్ కూడా చేసింది. కానీ నెటిజ‌న్లు ఊరుకోరుగా. అప్ప‌టికే ఆమె వీడియోను డౌన్‌లోడ్ చేసి వైర‌ల్ చేసేశారు. దీంతో ఆమె స్పందించ‌క త‌ప్ప‌లేదు. ఏదో చిన్న పొర‌పాటు జ‌రిగింది.. అయినా అంద‌రు మ‌హిళ‌ల్లాగే నాకూ ఉన్నాయిగా.. అందులో కామెంట్ చేయాల్సిన పనేముంది.. అని స‌మ‌ర్థించుకుంది. అయితే తాజాగా ఈమె మ‌రోసారి విమ‌ర్శ‌ల పాలైంది.

Payal Rajput responded on comments about her ad
Payal Rajput

ఓ ఆల్క‌హాల్ బ్రాండ్‌ను ప్ర‌మోట్ చేస్తూ పాయ‌ల్ రాజ్ పూత్ యాడ్ చేసింది. మ‌ద్యం తాగ‌మ‌ని ప్రోత్సహించేలా ఆ యాడ్ ఉంది. దీంతో నెటిజ‌న్లు త‌మ నోళ్ల‌కు ప‌ని చెప్పారు. ఆమెపై కామెంట్లు చేయ‌సాగారు. ఆమెను విమ‌ర్శిస్తూ ట్రోల్ చేశారు. అయితే త‌న‌పై వ‌స్తున్న విమర్శ‌ల‌కు పాయ‌ల్ స‌మాధానం చెప్పింది. తామూ మ‌నుషుల‌మేన‌ని.. మ‌హిళ‌లు కూడా మ‌ద్యం తాగుతార‌ని.. చిల్ అవుతార‌ని.. అందులో త‌ప్పేముంద‌ని.. ఇందులో ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని.. పాయ‌ల్ రిప్లై ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ ఆమెపై వ‌స్తున్న విమ‌ర్శ‌లు మాత్రం ఆగ‌డం లేదు.

ఇక పాయ‌ల్ రాజ్‌పూత్‌కు ప్ర‌స్తుతం సినిమా అవ‌కాశాలు లేవ‌నే చెప్పాలి. చివ‌రిసారిగా ఆమె తెలుగులో అన‌గ‌న‌గా ఓ అతిథి అనే మూవీలో న‌టించింది. ఈమె న‌టించిన ఆర్ఎక్స్ 100 మూవీ ఎలా హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. అయితే ఆ త‌రువాత ఈమె ప‌లు చిత్రాల్లో అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించినా.. ఆ మూవీలు హిట్ కాలేదు. దీంతో ప్ర‌స్తుతం ఈమె మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. ఇక ప్ర‌స్తుతం ప‌లు భాష‌ల్లో సినిమాల‌తోపాటు యాడ్స్‌లోనూ ఈమె న‌టిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment