Sri Reddy : పీత‌ల కూర చేసిన శ్రీ‌రెడ్డి.. చూస్తుంటేనే నోరూరిపోతోంది..!

April 13, 2022 7:21 PM

Sri Reddy : న‌టి శ్రీ‌రెడ్డి పేరు చెప్ప‌గానే మ‌న‌కు ఈమె చుట్టూ ఉన్న వివాదాలే గుర్తుకు వ‌స్తాయి. అంత‌గా ఈమె వివాదాల్లో ఎల్ల‌ప్పుడూ నిలుస్తుంటుంది. ఇకఈ మ‌ధ్య కాలంలో ఈమె సోష‌ల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటోంది. త‌ర‌చూ వంట‌లు చేస్తూ ఆ వీడియోల‌ను యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తోంది. దీంతో ఆమె వీడియోల‌కు మంచి స్పంద‌నే ల‌భిస్తోంది. ఇక తాజాగా శ్రీ‌రెడ్డి పీత‌ల కూర చేసి అల‌రించింది. దానికి సంబంధించిన వీడియోను ఆమె యూట్యూబ్‌లో పోస్ట్ చేయ‌గా.. అది వైర‌ల్ అవుతోంది.

Sri Reddy cooked crabs curry viral video
Sri Reddy

శ్రీ‌రెడ్డి ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటోంది. నాగ‌బాబు కుమార్తె నిహారిక డ్ర‌గ్స్ కేసు విష‌య‌మై శ్రీ‌రెడ్డి స్పందించింది. నాగ‌బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తుంది. ఆయ‌న‌ను అరేయ్ అంటూ సంబోధించింది. కుమార్తెను స‌రిగ్గా పెంచ‌లేని నువ్వు నీతులు బోధిస్తావా.. అంటూ ఆయ‌న‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించింది.

కాగా శ్రీ‌రెడ్డి త‌న యూట్యూబ్ చాన‌ల్‌లో వంట‌ల వీడియోల‌తోపాటు బ్యూటీ టిప్స్ వీడియోల‌ను కూడా పోస్ట్ చేస్తోంది. ఈ మ‌ధ్యే ఆమె ఒక వీడియోను పోస్ట్ చేసింది. మ‌ట‌న్ కూర‌, చేప‌లు వండిన శ్రీ‌రెడ్డి.. తాజాగా ఈలి పీతల కూర చేసింది. ఆ కూరను చూస్తుంటేనే నోరూరిపోతోంది. ఈ క్ర‌మంలోనే ఆ వీడియో ఎంతో మందిని ఆక‌ట్టుకుంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment