దగ్గు, జలుబు దూరంచేసే మిరియాల రసం తయారీ విధానం..

May 22, 2021 1:06 PM

ప్రస్తుతం ఉన్న ఈ కరోనా పరిస్థితులలో ప్రతి ఒక్కరు రోగ నిరోధకశక్తిని పెంచుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే కొద్దిగా దగ్గు జలుబు చేసిన దగ్గు జలుబు నుంచి ఉపశమనం పొందటం కోసం మిరియాల రసం ఎంతో ఉపయోగపడుతుంది.మరి దగ్గు జలుబును దూరం చేసే మిరియాల రసం ఏవిధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…

కావలసిన పదార్థాలు

*రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు

*రెండు రెమ్మలు కరివేపాకు

*టేబుల్ టీస్పూన్ ధనియాలు

*రెండు ఎండుమిరపకాయలు

*1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర

*నిమ్మకాయ సైజు చింతపండు

*1/2 టేబుల్ స్పూన్ ఆవాలు

*వెల్లుల్లి రెబ్బలు

*కొత్తిమిర

*ఉప్పు తగినంత

*తగినంత నీరు

*2 టేబుల్ స్పూన్ల నూనె

తయారీ విధానం

ముందుగా చింతపండు కడిగి నీటిలో నానబెట్టుకోవాలి. స్టవ్ పై కడాయి ఉంచి కొద్దిగా నూనె వేసి మిరియాలు, ధనియాలు, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత వీటిని మెత్తగా మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ముందుగా నానబెట్టిన చింతపండు నుంచి రసం తీసి మరొక గిన్నెలో పోసుకోవాలి. ఈ పులుపుకు తగ్గట్టుగా నీటిని వేసుకోవాలి. ఈ నీటిలోకి ముందుగా తయారు చేసుకున్న మిశ్రమం కలిపి స్టవ్ పై బాగా ఉడకనివ్వాలి.

స్టవ్ పై మరొక చిన్న పాన్ లో పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసి, నూనె వేడెక్కాక ఆవాలు, ఎండు మిర్చి ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి ఆవాలు చిటపట అన్న తరువాత ఉదుకుతున్నటువంటి మిరియాల రసంలోకి పోపు పెట్టాలి. తరువాత రుచికి తగినంత ఉప్పును వేసుకొని ఆపై కోతిమిర చల్లుకొని మరో రెండు నిమిషాలు పాటు ఉడికించినట్లయితే ఎంతో రుచి కరమైన మిరియాల రసం తయారవుతుంది. ఈ మిరియాల రసం వేడి వేడి అన్నంలోకి తినడం లేదా చల్లారిన తర్వాత తాగటం వల్ల తొందరగా దగ్గు జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment