Beast Movie Review : బీస్ట్ మూవీ రివ్యూ.. ప‌ర‌మ బోరింగ్..!

April 13, 2022 12:11 PM

Beast Movie Review : మాస్టర్‌ తర్వాత విజయ్‌ నుంచి వచ్చిన చిత్రం బీస్ట్. పూజా హెగ్డె కథానాయకగా, డాక్టర్‌ ఫేమ్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్ నిర్మించిన బీస్ట్ బుధవారం విడుద‌లైంది. భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోంది. మ‌రి సినిమా క‌థ ఎలా ఉంది.. అనే విష‌యానికి వ‌స్తే..

Beast Movie Review very boring action drama
Beast Movie Review

రా (RAW) ఏజెంట్ వీర రాఘవన్ (విజయ్) సీక్రెట్ ఆపరేషన్ స్పెష‌లిస్ట్‌. అతను జోధ్‌పూర్ లో ఉమర్ ఫరూఖ్ అనే టెర్రరిస్ట్ ని పట్టుకునే ఆపరేషన్ చేపడతాడు. అంతా సవ్యంగా జరుగుతుంది కానీ ఆ సీక్రెట్ ఆపరేషన్ లో ఊహించని విధంగా జరిగిన చిన్న పొరపాటు జ‌రుగుతుంది. ఆ ఆప‌రేష‌న్‌లో ఓ చిన్నారి చనిపోతుంది. దాంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి వృత్తి జీవితానికి దూరంగా ఉంటాడు వీర రాఘవన్. అంతేకాదు ఆ డిప్రెషన్ నుండి బయటపడడానికి తీసుకునే ట్రీట్‌మెంట్ లో భాగంగా ప్రీతి (పూజా హెగ్డె)ను కలుస్తాడు. ఆమె ప్రేమ‌లో ప‌డ‌తాడు. అయితే తమ లీడర్ ఉమర్ పరూఖ్ ని విడుదల చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు టెర్ర‌రిస్ట్‌లు. మ‌రి వాళ్ల డిమాండ్ ప్ర‌కారం విజ‌య్ వారిని వ‌దిలిపెడ‌తాడా, చివ‌రికి టెర్ర‌రిస్ట్ ల భ‌ర‌తం ఎలా ప‌డ‌తాడు.. అనేది వెండితెర‌పై చూడాల్సిందే.

ప్రేక్షకుల మీద కక్ష తీర్చుకోవటం తప్పించి, ఓవరాల్ గా గ్రిప్పింగ్ గానీ థిల్లింగ్ కానీ ఎమోషన్స్ లేని యాక్షన్ హోస్టేజీ డ్రామాగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ట్టు ఉంది. అభిమానులు మాత్ర‌మే ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు త‌ప్ప నార్మ‌ల్ ఆడియ‌న్స్‌కి పెద్ద‌గా రుచించ‌దు. ఈ సినిమాలో అనిరుధ్‌ స్వ‌ర‌ప‌ర‌చిన బాణీలు చాలా బాగున్నాయి. అర‌బిక్ అనే సాంగ్ వెండితెర‌పై అల‌రించింది. కొన్ని యాక్ష‌న్ సీన్స్ కూడా ఆక‌ట్టుకున్నాయి.

విజ‌య్ లాంటి పెద్ద హీరోతో నెల్స‌న్ ఇలాంటి ప్రయోగం చేయ‌డంపై అభిమానులు మండిప‌డుతున్నారు. భారీ బ‌డ్జెట్ పెట్టి ప్రేక్ష‌కుల స‌హనాన్ని ప‌రీక్షిస్తున్నావా.. అంటూ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు సినిమాలో కొన్ని కామెడీ స‌న్నివేశాలు చాలా బోరింగ్‌గా ఉండ‌డంతో ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా బీస్ట్ అంత‌గా మెప్పించే చిత్రం కాద‌నే అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment