Natu Natu Song : నాటు నాటు సాంగ్‌కు చిరంజీవి – బాల‌కృష్ణ స్టెప్పులు.. ఫొటో వైరల్‌..!

April 8, 2022 9:18 AM

Natu Natu Song : ఇటీవ‌లి కాలంలో సంగీత ప్రియుల‌ని ప‌లు సాంగ్స్ ఎంత‌గానో అల‌రించిన విష‌యం తెలిసిందే. శ్రీ వ‌ల్లి, నాటు నాటు, అర‌బిక్ కుతు సాంగ్స్ సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. అయితే ఇందులో నాటు నాటు సాంగ్‌కి రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ చేసిన డ్యాన్స్ చాలా మందిని ఆక‌ట్టుకుంది. ఈ పాటలో చరణ్, తారక్ డ్యాన్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించింది. హుక్ స్టెప్‌ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. నాటు నాటు స్టెప్పులేయని అభిమాని లేడు. సోషల్ మీడియాలో ఈ పాట..స్టెప్పులు ట్రెండింగ్ లో నిలిచాయి. ఈ సాంగ్ విడుద‌లైన త‌ర్వాత సామాన్యులు, సెల‌బ్రిటీలు సైతం ఈ పాట‌కి స్టెప్పులు వేశారు. నాటు నాటు సాంగ్ మానియాలో మునిగి తేలారు.

Natu Natu Song  Chiranjeevi and Balakrishna photo viral
Natu Natu Song

ప్ర‌మోష‌న్స్ స‌మ‌యంలో బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్..అమీర్ ఖాన్ సైతం ఈ హుక్ స్టెప్పు వేసి ఆకట్టుకున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీలో దర్శకుడు రాజమౌళి – మరో దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి స్టేజ్ పై నాటు నాటు స్టెప్ ని దించేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈవేడుకలోకి మెగాస్టార్ చిరంజీవి-నటసింహం బాలకృష్ణని సైతం అభిమానులు లాగుతున్నారు. నాటు నాటు స్టెప్పుకు చిరంజీవి- బాలయ్య ముఖాల్ని మార్పింగ్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇద్దరు హీరోల అభిమానులు ఆ మార్పింగ్ ఫొటోని ఎవరి సోషల్ మీడియా ఖాతాల్లో వారు పోస్ట్ చేసి షేర్ చేయడం విశేషం.

చిరంజీవి- బాల‌య్య అభిమానుల మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా ఉంటుంది. కానీ ఈ పాట విషయంలో అభిమానులే తమ హీరోల్ని తెగ ప్రోత్సహిస్తున్నారు. ఈ పాటకు సంబంధించిన మార్పింగ్ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇక‌ నిజంగా బాలయ్య-చిరంజీవి ఒకే వేదికపై కలిస్తే మాత్రం నాటు నాటు తప్పక పడుతుందని చెప్పొచ్చు. అప్పుడు ఆ కిక్కే వేరుగా ఉంటుంది. కానీ ఆ సమయం రావాలి. చిరంజీవి-బాలయ్య ఇలాంటి విషయాల్లో చాలా జోవియల్ గా ఉంటారు. బాల‌య్య స‌రదాను అన్‌స్టాప‌బుల్ షోలో మ‌నందరం చూశాం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now