Samantha : సమంత ముంబై వెళ్లడానికి అసలు కారణం.. ఇదేనా ?

April 6, 2022 7:17 PM

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత‌ రుత్ ప్రభు ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతోంది. దీంతోపాటు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ తో కూడా ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేస్తోంది. ప్రస్తుతం సమంత ముంబైకు షిఫ్ట్ అయ్యేందుకు ఇల్లు కొనుక్కోవడంలో బిజీ అయ్యింది. ఈ ఇంటికి కూడా ఎన్నో కండిషన్స్ పెట్టేసింది. ఇక టాలీవుడ్ లో సమంత ఎండార్స్ మెంట్స్ ను మేనేజర్లు చూసుకుంటున్నారు. అలాగే ముంబైలో కాస్టింగ్ అండ్ ఆర్టిస్ట్ మేనేజ్ మెంట్ తో వ్యవహరించే ఏజెన్సీలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వాళ్లు టాప్ హీరోయిన్స్ కు బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తుంటారు.

this is why Samantha going to Mumbai
Samantha

ఈ క్రమంలో కొత్తగా బాలీవుడ్ కనెక్షన్ కోసం ఓ కార్పొరేట్ కంపెనీతో ఓ ఏజెన్సీ ద్వారా ఇప్పుడు సామ్ సైన్ అప్ చేసిందని టాక్ వినిపిస్తోంది. సమంత ఇంత పెద్ద బ్రాండ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది.. బాలీవుడ్ లో ఆమెను రకరకాల ప్రచారాల్లో నిలబెట్టడం వరకు.. ఈ ఏజెన్సీ హ్యాండిల్ చేస్తుందట. అదే సమయంలో వారి గేమ్ లో బెస్ట్ గా ఉన్న వాళ్లను.. కొంత మంది టాప్ ప్రొడ్యూసర్లు, దర్శకులను కలిసేందుకు కూడా ఈ ఏజెన్సీ ఆమెకు హెల్ప్ చేస్తుందన్నమాట. అలా సమంత బాలీవుడ్ లో అతి త్వరలోనే రెండు భారీ ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

స‌మంత‌ స్టార్ డమ్ ఇక బాలీవుడ్ లోనూ హల్ చల్ అవుతుందని అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ప్రజంట్ సమంత.. శాకుంతలం, యశోద అనే పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది. కోలీవుడ్, టాలీవుడ్ లో తెరకెక్కుతున్న బైలింగ్వల్ సినిమా కాతు వాక్కుల రెండు కాదల్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉంది. నెక్ట్స్ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వనుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment