Chiranjeevi : ఆ యాడ్ కోసం చిరంజీవి ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకున్నారో తెలిస్తే.. నోరెళ్ల‌బెట్టాల్సిందే..!

April 5, 2022 1:08 PM

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల త‌ర్వాత ఓ యాడ్‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. శుభగృహ రియల్ ఎస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఓ యాడ్ చేశారు. తెలుగు కొత్త సంవత్సరాది రోజున ఈ యాడ్‌ను విడుదల చేశారు. కాస్త వెరైటీగా యాడ్‌ని ప్లాన్ చేయ‌గా, ఈ యాడ్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఈ యాడ్ కోసం చిరంజీవి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ యాడ్ కోసం చిరంజీవి దాదాపుగా రూ. 7 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒక్కో సినిమా కోసం రూ. 20 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్న చిరంజీవి యాడ్ కోసం రూ. 7 కోట్ల వరకు చార్జ్ చేసినట్టు సమాచారం.

Chiranjeevi reportedly took huge remuneration for subhagruha ad
Chiranjeevi

కొన్ని నిమిషాల యాడ్ కోసం చిరంజీవి అంత మొత్తం వసూలు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మొత్తంగా చిరంజీవి వంటి సీనియర్ హీరో ఈ యాడ్ చేయడంతో శుభగృహ రియల్ ఎస్టేట్‌కు ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుందో చూడాలి. ఈ యాడ్‌ను సుకుమార్ డైరెక్ట్ చేశారు. గతంలో చిరంజీవి.. కృష్ణవంశీ దర్శకత్వంలో థమ్స్ అప్‌తో పాటు నవరత్న ఆయిల్‌కు పదమూడేళ్ల క్రితం బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే కదా. ఇక చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్నారు. ఆయ‌న‌ నటించిన ఆచార్య సినిమా షూటింగ్ కంప్లీటైంది.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో తొలిసారి పూర్తి స్థాయిలో తన తనయుడు రామ్ చరణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక మోహన్ రాజా డైరెక్షన్‌లో గాడ్ ఫాద‌ర్ అనే టైటిల్‌తో సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరో కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ పాత్రకు సంబంధించిన షూట్ పూర్త‌యింది. దీంతో పాటు చిరంజీవి.. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నారు. దాంతోపాటు బాబీ సినిమా చేస్తున్నారు. ఇంకోవైపు వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేయ‌నున్నారు. ఇలా చిరంజీవి ఓ వైపు సినిమాల‌తో బిజీగా ఉంటూనే మ‌రోవైపు యాడ్ లో న‌టించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now