Renu Desai : ఆ విష‌యంలో పూర్తి క్లారిటీ ఇచ్చేసిన రేణు దేశాయ్‌..!

April 2, 2022 11:23 PM

Renu Desai : మాస్ మ‌హారాజ ర‌వితేజ ఈ మ‌ధ్య కాలంలో ప‌లు వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. ఈయ‌న న‌టించిన ఖిలాడి మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద అనుకున్న విజ‌యాన్ని సాధించ‌లేక‌పోయింది. అయితే ఈయ‌న త్వ‌ర‌లోనే రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ఇక దీని త‌రువాత ఆయ‌న చేయ‌బోతున్న చిత్రం.. టైగ‌ర్ నాగేశ్వ‌ర్‌రావు. ఈ సినిమాను ఉగాది సంద‌ర్భంగా శ‌నివారం అధికారికంగా లాంచ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవితోపాటు ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య‌, న‌టి రేణు దేశాయ్ ముఖ్య అతిథిగా హాజర‌య్యారు. దీంతో అంద‌రూ ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్యపోయారు.

Renu Desai given full clarity on her acting career
Renu Desai

ఇక రేణు దేశాయ్ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌డం ఎంతో మందికి షాకిచ్చింది. ఆమె మ‌ళ్లీ న‌టిస్తుందా.. అని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. టైగర్ నాగేశ్వ‌ర్ రావు సినిమాలో రేణు దేశాయ్.. ర‌వితేజ‌కు సోద‌రిగా న‌టిస్తుంద‌ని తెలుస్తుండ‌గా.. ఆమెది చాలా ప‌వ‌ర్‌ఫుల్ రోల్ అని అందుక‌నే ఆమె ఒప్పుకున్నార‌ని తెలుస్తోంది. ఇక ఎంతో కాలంగా రేణు దేశాయ్ సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు. ఒక సినిమాకు ఆమె ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కానీ యాక్టింగ్ చేయ‌లేదు. దీంతో ఆమె మ‌ళ్లీ యాక్టింగ్ చేస్తుండ‌డం ఫ్యాన్స్‌కు సంతోషాన్నిస్తోంది.

కాగా టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు చిత్రం లాంచింగ్ సంద‌ర్భంగా రేణు దేశాయ్ ఒక విష‌యంపై మాత్రం పూర్తిగా క్లారిటీ ఇచ్చేశారు. తాను సినిమాల్లో న‌టించేందుకు సిద్ధ‌మ‌ని చెప్పారు. కానీ క్యారెక్ట‌ర్ త‌న‌కు న‌చ్చాల‌ని అన్నారు. టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు సినిమాలో త‌న పాత్ర బాగుంటుంద‌ని.. అందుక‌నే తాను ఈ మూవీలో న‌టించేందుకు అంగీక‌రించాన‌ని తెలిపారు. అయితే ఈమె సినిమాల్లో న‌టించేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని క్లారిటీ ఇచ్చేశారు. కానీ త‌న‌కు క‌థ బాగా న‌చ్చాల‌ని చెప్పారు. మ‌రి నిర్మాత‌లు ఈమె కోరిక‌కు అనుగుణంగా సినిమాలు తీస్తూ ఈమెకు ఆఫ‌ర్‌లు అందిస్తారో.. లేదో.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment