Bandla Ganesh : మెగాస్టార్ చిరంజీవి జ‌న‌సేన‌లోకి..? బండ్ల గ‌ణేష్ ఏమంటున్నారు..?

March 30, 2022 9:27 PM

Bandla Ganesh : ప్ర‌జా రాజ్యం పార్టీని స్థాపించాక రాజ‌కీయాల‌కు తాను సెట్ కాన‌ని చెప్పి మెగాస్టార్ చిరంజీవి ఆ రంగానికి పూర్తిగా దూర‌మ‌య్యారు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు వ‌రుస‌గా షూటింగ్‌ల‌లో పాల్గొంటున్నారు. రాజ‌కీయాల జోలికి అస‌లు వెళ్ల‌డం లేదు. అయితే త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ స్థాపించిన జ‌న‌సేన‌లో మెగాస్టార్ చిరంజీవి చేరాల‌ని ఎప్ప‌టి నుంచో మెగా అభిమానులు కోరుతున్నారు. ఇప్ప‌టికే నాగ‌బాబు ఆ పార్టీలో ఉండి ప‌వ‌న్‌కు చేదోడు వాదోడుగా ఉన్నారు. దీంతో చిరంజీవి కూడా రావాల‌ని అభిమానులు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. అయితే ఈ విష‌యంపై తాజాగా ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తోంది. అది కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా కావ‌డం విశేషం.

Bandla Ganesh interested in Janasena joining of Chiranjeevi
Bandla Ganesh

బండ్ల గ‌ణేష్ సామాజిక మాధ్యమాల్లో ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. మెగా అభిమానులు చేసే పోస్టుల‌కు ఆయ‌న రిప్లై ఇస్తుంటారు. ఆయ‌న ప‌వ‌న్‌కు వీరాభిమాని అన్న విష‌యం విదిత‌మే. అయితే తాజాగా ఓ అభిమాని.. చిరంజీవిని జ‌న‌సేన‌లోకి రావాల్సిందిగా కోరాడు. జ‌న‌సేన‌లోకి చిరంజీవి వ‌చ్చి పార్టీని అధికారంలోకి తేవాల‌ని, మెగాస్టార్ స్టామినా ఏంటో చూపించాల‌ని, ఏపీ ప్ర‌జ‌ల‌ను ఆదుకోవాల‌ని కోరుతూ.. ఓ అభిమాని ట్వీట్ చేశాడు. అయితే ఆ ట్వీట్‌కు ఆశ్చ‌ర్య‌క‌రంగా బండ్ల గ‌ణేష్ రిప్లై ఇచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి రావాల‌ని.. ప్ర‌జా సేవ చేయాల‌ని.. జ‌న‌సేన‌లో చేరి ఏపీలో అధికారంలోకి రావాల‌ని.. ఓ అభిమాని కోర‌గా.. అందుకు బండ్ల గ‌ణేష్ రిప్లై ఇస్తూ.. మ‌రి నేను ? అంటూ ట్వీట్ చేశారు. దీనికి ఆ అభిమాని చేసిన ట్వీట్‌ను కూడా జోడించారు. దీంతో ట్విట్ట‌ర్ వేదిక‌గా మెగాస్టార్ చిరంజీవి జ‌న‌సేన‌లోకి వ‌చ్చే విష‌యంపై.. మ‌ళ్లీ చ‌ర్చ న‌డుస్తోంది. అయితే ఇదంతా స‌ర‌దాకే కానీ.. వాస్త‌వానికి చిరంజీవికి మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఉద్దేశం లేద‌ని స్ప‌ష్టంగా క‌నిపిస్తుంద‌ని చెప్పవ‌చ్చు. అదే ఉంటే.. ఆయ‌న త‌న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినా.. తిరిగి ఏదో ఒక పార్టీలో చేరి కొన‌సాగి ఉండేవారు. కానీ ఆయ‌న ఇప్పుడు మ‌ళ్లీ పూర్తిగా సినిమాల‌కే అంకిత‌మ‌య్యారు. క‌నుక చిరంజీవి ఇప్ప‌ట్లో మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చే అవ‌కాశాలు లేవ‌నే చెప్పాలి..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now