Hebah Patel : నీ వయసెంత అంటూ ప్రశ్నించిన నెటిజన్‌.. దిమ్మతిరిగే సమాధానం చెప్పిన హెబా పటేల్..!

March 21, 2022 3:48 PM

Hebah Patel : కుమారి 21 ఎఫ్‌ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి హెబా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాలోనే గ్లామర్ ఒలకబోసింది. దీంతో కుర్రకారును ఆకట్టుకుంది. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం వ్యక్తం చేయాల్సిన పనిలేదు. ఇలా మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న హెబా పటేల్ ఆ తర్వాత పలు సినిమాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే హీరో రామ్ నటించిన రెడ్ చిత్రంలో ఐటమ్ సాంగ్ ద్వారా మళ్లీ ఫామ్ లోకి వచ్చింది.

Hebah Patel replied to a netizen who asked her real age
Hebah Patel

ఈ పాట ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ వరుసగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న హెబా పటేల్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఇలా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఈమెకు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా నటి హెబా పటేల్ ను ఏకంగా నీ వయసెంత ? అంటూ ఓ నెటిజన్‌ ప్రశ్నించాడు.

ఇలా నెటిజన్ అడిగిన ప్రశ్నకు హెబా పటేల్ దిమ్మతిరిగే సమాధానం చెప్పింది. ‘నాలోని జ్ఞానానికి సరిపోయే వయసుకు చేరుకున్నానని’ తన అసలు వయసు ఎంతో చెప్పకుండా మాట దాటేసింది. అలాగే మరొక నెటిజన్ మీ అందం రహస్యం ఏంటి అని ప్రశ్నించగా ఇది చాలా పెద్ద సీక్రెట్ అంటూనే తన అందానికి గల రహస్యం చెప్పేసింది. దేవుడిచ్చిన అందం కొంత అయితే డాక్టర్ల కృషి మరికొంత అంటూ సమాధానం చెప్పడంతో ఈమె తన అందం కోసం సర్జరీలు చేయించుకుందా.. అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమె చెప్పిన ఈ సమాధానాలు వైరల్‌ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now