ఐదు నిమిషాలలో ఎంతో రుచికరమైన పులిహోర తయారు చేయొచ్చు..ఇదిగో ఇలా!

May 18, 2021 8:14 PM

భోజనంలోకి ఏం కూర వండాలో తెలియడం లేదా కూర లేకుండా కేవలం అన్నంతోనే ఎంతో రుచికరమైన పులిహోరను కేవలం అయిదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. సాధారణంగా పులిహోర అంటేనే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఇక ఎంతో రుచికరమైన ఈ పులిహోరని ఏవిధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…

కావలసిన పదార్థాలు

*బియ్యం అరకిలో

*నిమ్మరసం 2 స్పూన్లు

*నాలుగు పచ్చిమిర్చి

*ఆవాలు టేబుల్ స్పూన్

*జీలకర్ర టేబుల్ స్పూన్

*మినపప్పు అర టేబుల్ స్పూన్

*శనగపప్పు అర టేబుల్ స్పూన్

*పసుపు చిటికెడు

*ఉప్పు తగినంత

*పల్లీలు ఒక చిన్న కప్పు

*నూనె 4 టేబుల్ స్పూన్లు

*ఒక కరివేపాకు రెమ్మ

*చిన్నగా తరిగిన కొత్తిమిర

తయారీ విధానం

ముందుగా అరకిలో బియ్యాన్ని మెత్తగా కాకుండా పొడి పొడిగా అన్నం తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి ఉంచి అందులోకి నూనె వేయాలి. నూనె వేడయ్యాక మినప్పప్పు, పల్లీలు, శనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా బంగారువర్ణంలోకి రాగానే ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి బాగా కలియబెట్టాలి. ఆవాలు చిటపట అనగానే చిటికెడు పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. ఒక రెండు నిమిషాలు పాటు వేయించిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమంలోకి ముందుగా తయారు చేసుకున్న అన్నం వేసి బాగా నిదానంగా కలియబెట్టాలి. అన్నం బాగా కలిసిన తర్వాత ఇందులోకి నిమ్మరసం వేసి, ఆపై కోతిమీర కలపడంతో ఎంతో రుచికరమైన పులిహోర తయారవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment