Poonam Kaur : మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన పూన‌మ్ కౌర్‌.. ఈసారి ఏడ్చేసింది..

March 9, 2022 8:16 AM

Poonam Kaur : న‌టి పూన‌మ్ కౌర్ ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. వివాదాస్ప‌ద పోస్టులు పెడుతూ వాటిని వెంట‌నే తీసేస్తోంది. దీంతో ఆమె పెట్టే పోస్టులు వైర‌ల్‌గా మారుతున్నాయి. త‌న జీవితాన్ని ఒక వ్య‌క్తి, ఒక ద‌ర్శ‌కుడు నాశ‌నం చేశార‌ని.. ఇప్ప‌టికే ఆమె పలు సార్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అయితే మ‌రోసారి మీడియా ఎదుట ఇదే విష‌యాన్ని చెబుతూ ఆమె క‌న్నీటి ప‌ర్యంతం అయింది.

Poonam Kaur again sensational comments this time she cried
Poonam Kaur

పూన‌మ్‌కౌర్‌ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం నాతి చరామి. ఈ సినిమా ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది. దీన్ని ఏకంగా 20 ఓటీటీల్లో స్ట్రీమ్‌ చేయనున్నారు. అందులో భాగంగానే నిర్వహించిన మీడియా సమావేశంలో పూనమ్‌ కౌర్ క‌న్నీటి ప‌ర్యంతం అయింది. మ‌రోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.

తాను సినిమా ఇండస్ట్రీలోకి ఎన్నో కలలతో వచ్చానని.. కానీ కొందరు రావణాసురులు తన కలను నాశనం చేశారని.. పూనమ్‌ కౌర్‌ కన్నీరు పెట్టుకుంది. కొందరు తన జీవితాన్ని నాశనం చేశారని ఆమె వ్యాఖ్యలు చేసింది. చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉందంటూనే ఆమె భావోద్వేగానికి గురైంది. దీంతో పక్కనున్న వారు ఆమెను ఓదార్చారు. తన జీవితాన్ని కొందరు నాశనం చేసినందునే ఈ రోజున తాను సీత, దుర్గ, ద్రౌపదిలను తలచుకుని ధైర్యం చేసి జీవిస్తున్నానని తెలియజేసింది. అయితే ఓ దశలో సినిమాలను వదిలేసి ఇండియా నుంచి అమెరికాకు వెళ్లిపోదామని అనుకున్నానని.. కానీ ఒక ఫ్రెండ్‌ ఫోన్‌ చేసి తనకు ఈ సినిమా కథ చెప్పిందని.. ఇందులో మహిళ ప్రాధాన్యత అంశం ఉంటుందని చెప్పిందని.. అందుకనే నాతి చరామి సినిమాలో నటించానని తెలియజేసింది. ఈ క్ర‌మంలోనే పూన‌మ్ కౌర్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment