KA Paul : వార్నీ.. కేఏ పాల్‌ ను వెర్రి బకరాను చేశారు కదా..!

March 8, 2022 5:19 PM

KA Paul : కేఏ పాల్ గత ఎన్నికల సమయంలో ప్రజా శాంతి పార్టీ పేరుతో ఒక్కసారిగా రచ్చ చేశారు. ఎన్నికల తర్వాత కనుమరుగైన పాల్ తాజాగా ఏదో ఒక విషయం ద్వారా సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం తాను ప్రధానమంత్రి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇదిలా ఉండగా తాజాగా పుష్ప సినిమా గురించి కేఏ పాల్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

KA Paul became buffoon for that reason
KA Paul

పుష్ప సినిమా విడుదలై దాదాపు మూడు నెలలు కావస్తున్నా ఈ సినిమాకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదనే చెప్పాలి. ఇప్పటికీ ఎంతో మంది ఈ సినిమాలో బాగా ఫేమస్ అయిన పాటలకు రీల్స్‌ చేయడం, అలాగే తగ్గేదే లే.. అని డైలాగులు చెబుతూ ఫేమస్ అయ్యారు. ఇప్పటి వరకు ఎంతో మంది క్రికెటర్లు, సినీ సెలబ్రిటీలు పుష్ప డైలాగులు చెబుతూ ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో పుష్ప క్రేజ్‌ ఇప్పటికీ అలాగే ఉంది.

తాజాగా కేఏ పాల్ కూడా తగ్గేదేలే.. అంటూ పుష్ప డైలాగ్స్ చెప్పడం సంచలనంగా మారింది. అయితే ఈ విషయంపై స్పందిస్తూ ఆ సినిమా ఏంటో.. ఆ యవ్వారం ఏందో నాకు తెలియదు. ఎవరో ముగ్గురు వచ్చి ప్రజాశాంతి పార్టీకి అభిమానులని ఈ డైలాగులు చెబితే పార్టీకి ఫండ్ ఇస్తామని చెప్పడంతో చెప్పాను. ఇంత వరకు అడ్రెస్ లేరంటూ పాల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఎవరో ఏంటో తెలియకుండా వారెవరో చెప్పమనగానే అలా డైలాగ్స్‌ చెప్పేయడమేనా.. వెర్రి  బకరా.. అయ్యావుగా.. అని కొందరు నెటిజన్లు కేఏ పాల్‌పై కామెంట్లు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment