Diamond : మ‌ట్టిలో దొరికిన వ‌జ్రం.. రాత్రికి రాత్రే అత‌ను కోటీశ్వ‌రుడు అయ్యాడు..!

February 22, 2022 8:59 PM

Diamond : అదృష్టం అనేది జీవితంలో ఎవ‌రినైనా ఒక్క‌సారి మాత్ర‌మే వ‌రిస్తుంది. అది వ‌రించిన‌ప్పుడు రాత్రికి రాత్రే కొంద‌రు కోటీశ్వ‌రులు అవుతుంటారు. స‌రిగ్గా అక్క‌డ కూడా ఇలాగే జ‌రిగింది. ఎన్నో ఏళ్లుగా వారు ప‌డిన శ్ర‌మ‌కు త‌గిన ప్ర‌తిఫ‌లం ల‌భించింది. అత్యంత ఖ‌రీదైన వ‌జ్రం వారికి ల‌భించింది. దీంతో వారు కోటీశ్వ‌రులు అయ్యారు. వివ‌రాల్లోకి వెళితే..

man found Diamond in soil became millionaire overnight
Diamond

 

మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలో ఉన్న‌ సుశీల్‌ శుక్లా కుటుంబం గ‌త కొన్నేళ్ల నుంచి ఇటుకల బట్టీని నడుపుతోంది. ఈ బట్టీ కోసం మట్టిని కృష్ణ కళ్యాణ్‌పూర్‌ ఏరియా నుంచి తెస్తుంటారు. అయితే తాజాగా సుశీల్ కుటుంబం అలా సేక‌రించిన మ‌ట్టిని ప్రాసెస్ చేస్తుండ‌గా.. అందులోంచి ఒక వ‌జ్రం బ‌య‌ట ప‌డింది. దాని ఖ‌రీదు రూ.1.20 కోట్ల‌ని తేలింది. అది 26.11 క్యారెట్ల వ‌జ్రం. దీంతో సుశీల్ కుటుంబం రాత్రికి రాత్రే ధ‌నిక కుటుంబంగా మారింది. అలా సుశీల్ రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడు అయ్యాడు.

అయితే స‌ద‌రు ప్రాంతం వ‌జ్రాల‌కు నిల‌యం. గ‌తంలో ఎంతో మంది ఆ ప్రాంతంలో వ‌జ్రాల‌ను సాధించారు. అనేక చోట్ల వ‌జ్రాలు కొంద‌రికి ల‌భించాయి. అందువ‌ల్ల గ‌తంలోనూ ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా సుశీల్‌కు ఓ వ‌జ్రం ల‌భించింది. దీంతో దాన్ని అమ్మ‌గా వ‌చ్చిన సొమ్ముతో ఏదైనా బిజినెస్ చేసుకుంటాన‌ని చెబుతున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment