Khiladi Movie Trailer : ఖిలాడి ట్రైల‌ర్.. ఫుల్ యాక్ష‌న్, అందాల ఆర‌బోత‌.. లిప్ లాక్స్‌..!

February 7, 2022 6:40 PM

Khiladi Movie Trailer : మాస్ మ‌హారాజ ర‌వితేజ న‌టించిన ఖిలాడి మూవీ అఫిషియ‌ల్ ట్రైల‌ర్‌ను కాసేప‌టి క్రిత‌మే లాంచ్ చేశారు. ఇందులో ర‌వితేజ డ్యుయల్ షేడ్స్‌లో క‌నిపించిన‌ట్లు తెలుస్తోంది. ఒకటి ఫ‌న్నీ, రొమాంటిక్ క్యారెక్ట‌ర్ కాగా.. ఇంకొక‌టి క‌న్నింగ్ క్యారెక్ట‌ర్ అని తెలుస్తోంది. ఇందులో యాక్ష‌న్ సీన్ల‌ను ఒక రేంజ్‌లో తెర‌కెక్కించార‌ని.. ట్రైల‌ర్‌ను చూస్తే స్ప‌ష్ట‌మ‌వుతుంది.

Khiladi Movie Trailer action packed entertainer from Ravi Teja
Khiladi Movie Trailer

ఇక ఈ మూవీలో ప్రేక్ష‌కుల‌కు కావ‌ల్సిన అన్ని క‌మర్షియ‌ల్ హంగులు ఉన్న‌ట్లు ట్రైల‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఇందులో ర‌వితేజతోపాటు డింపుల్‌ హ‌య‌తి, మీనాక్షి చౌద‌రిలు హీరోయిన్లుగా న‌టించారు. అయితే ర‌వితేజ డింపుల్ హ‌య‌తికి లిప్ లాక్ ఇస్తున్న సీన్ ఒక‌టి తాజాగా లీకైంది. కానీ ట్రైల‌ర్‌లో మాత్రం మీనాక్షితో లిప్ లాక్ చూపించారు. దీన్ని బ‌ట్టి చూస్తే ఈ ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల‌తో ర‌వితేజ రొమాన్స్ చేశాడ‌ని తెలుస్తోంది.

ఇక ఈ మూవీలో అర్జున్ ఒక ముఖ్య‌మైన పాత్ర‌లో క‌నిపించిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అలాగే అన‌సూయ కామెడీ క్యారెక్ట‌ర్ చేసిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ఇక ఓవ‌రాల్‌గా చూస్తే ఖిలాడి ట్రైల‌ర్ హై వోల్టేజ్ యాక్ష‌న్ ను క‌లిగి ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే సినిమా ప్రేక్ష‌కుల‌కు కావ‌ల్సినంత వినోదాన్ని అందిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఇక ఈ మూవీలో ర‌వితేజ హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయ‌డంతోపాటు యాక్ష‌న్ స‌న్నివేశాల్లోనూ న‌టించాడ‌ని తెలుస్తోంది. ఈ మూవీకి ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ఈ నెల 11వ తేదీన ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తెలుగు, హిందీ భాష‌ల్లోనూ ఈ మూవీని విడుద‌ల చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now