Tollywood : టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ఏపీ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్ప‌నుందా ?

February 6, 2022 11:13 AM

Tollywood : గ‌త కొద్ది నెల‌లుగా అటు ఏపీ ప్ర‌భుత్వానికి, ఇటు టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా వివాదాలు చెల‌రేగుతున్నాయి. గ‌తంలో ప‌వ‌న్ రిప‌బ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ వేదిక‌గా చేసిన వ్యాఖ్య‌లు అగ్నికి ఆజ్యం పోసిన‌ట్లు అయ్యాయి. ఆయ‌న ఏపీ ప్రభుత్వం, మంత్రుల‌పై విమ‌ర్శ‌లు చేశారు. దీంతో ప‌వ‌న్‌ను ఏపీ మంత్రులు విమ‌ర్శించారు.

andhra pradesh government may tell good news to Tollywood
Tollywood

ప‌వన్ లాంటి అగ్ర హీరోలు అంత భారీ స్థాయిలో రెమ్యున‌రేష‌న్ తీసుకునే బ‌దులు దాన్ని త‌గ్గించుకుంటే.. త‌గ్గిన సినిమా టిక్కెట్ ధ‌ర‌ల‌తో పెద్ద న‌ష్ట‌మేమీ ఉండ‌ద‌ని మంత్రులు అన్నారు. దీంతో ఈ వివాదం అప్ప‌ట్లో చిలికి చిలికి గాలివాన అయింది. ఆ త‌రువాత అది ప‌వ‌న్ వ‌ర్సెస్ పోసానిగా మారింది. ఇక ఆ త‌రువాత మా అసోసియేష‌న్ ఎన్నిక‌లు జ‌రిగాయి. దీంతో ఈ వివాదాన్ని చాలా మంది మ‌రిచిపోయారు.

కానీ ఏపీ ప్ర‌భుత్వం మాత్రం ఏ విష‌యాన్ని మ‌రిచిపోలేదు. జీవోల మీద జీవోలు తెచ్చింది. సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఇక దీని త‌రువాత క‌రోనా మూడో వేవ్ వ‌చ్చింది. దీంతో పెద్ద సినిమాలు అన్నీ విడుద‌ల‌ను వాయిదా వేసుకున్నాయి. కాగా ఈ మధ్యే చిరంజీవి మ‌రోమారు సీఎం జ‌గ‌న్‌ను క‌లిశారు. ఈ క్ర‌మంలో స‌యోధ్య కుదిరింద‌ని.. త్వ‌ర‌లోనే టాలీవుడ్‌కు ఏపీ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెబుతుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు అవే నిజం కానున్నాయా..? అంటే.. అందుకు అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.

ఏపీ ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే సినిమా టిక్కెట్ ధ‌ర‌ల‌పై మళ్లీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని తెలుస్తోంది. సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌ను థియేట‌ర్లు అవ‌స‌రం అయిన‌ప్పుడు పెంచుకునేలా మ‌ళ్లీ ఇంకో జీవోను విడుద‌ల చేస్తార‌ని స‌మాచారం. అదే జ‌రిగితే టాలీవుడ్‌కు పండుగ చేసుకునే వార్త అని చెప్ప‌వ‌చ్చు. దీంతో త్వ‌ర‌లో విడుద‌ల కానున్న సినిమాల నిర్మాత‌లు ఊపిరి పీల్చుకుంటారు. ఈ క్రమంలోనే ఏపీ ప్ర‌భుత్వం ఈ విష‌యంపై పాజిటివ్‌గా ఉంద‌ని కూడా తెలిసింది. మ‌రి ఆ జీవోను ఎప్పుడు విడుద‌ల చేస్తారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now