Lata Mangeshkar : గాన‌కోకిల ల‌తా మంగేష్క‌ర్ ఇక లేరు.. క‌రోనాతో పోరాడి మృతి..

February 6, 2022 10:52 AM

Lata Mangeshkar : గాన కోకిల‌గా పేరు పొందిన ప్ర‌ముఖ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ మ‌నంద‌రికీ దూర‌మ‌య్యారు. ముంబైలోని సిటీ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న ఆమె తుది శ్వాస విడిచారు. ఈ విష‌యాన్ని కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. గ‌త నెల రోజుల నుంచి ఆమె క‌రోనా కార‌ణంగా హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆమె క‌న్నుమూశారు. కాగా లతా మంగేష్క‌ర్ ప్ర‌స్తుత వ‌యస్సు 92 ఏళ్లు.

Lata Mangeshkar is no more died after taking covid 19 treatment from one month
Lata Mangeshkar

భార‌త దేశం గర్వించదగ్గ గాన‌ కోకిల అయిన భారతరత్న లతా మంగేష్కర్ మృతి తీవ్ర విచార‌క‌రం. ఆమె ఆత్మకు శాంతి క‌ల‌గాలి. ఆమె మ‌ర‌ణం దేశానికి తీరని లోటు. సంగీత ప్రియులందరికీ ఆమె ఎల్ల‌ప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటారు. ఆమె గొంతు 30 వేలకు పైగా పాటలు పాడింది. లతా దీదీ చాలా ప్రశాంత స్వభావం కలవారు. ప్రతిభతో కూడిన సంపన్నురాలు. దేశవాసులందరిలాగే లతా మంగేష్కర్ సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. నాకు సమయం దొరికినప్పుడల్లా ఆమె పాడిన పాటలను తప్పకుండా వింటాను. భగవంతుడు ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలి. ఆమె కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వేడుకుంటున్నాను. ఓం శాంతి.. అంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్లు చేశారు.

కాగా క‌రోనా బారిన ప‌డిన ఆమె ఆరోగ్యం మ‌రింతగా క్షీణించింద‌ని వైద్యులు తెలిపారు. ఆమె కొద్ది రోజులుగా వెంటిలేట‌ర్‌పైనే చికిత్స తీసుకుంటున్నార‌ని, ఆమెకు కోవిడ్ 19తోపాటు న్యుమోనియా కూడా సోకింద‌ని.. ఈ క్ర‌మంలోనే ఆమె ఆరోగ్యం మ‌రింత క్షీణించ‌డంతో ఆమె క‌న్నుమూశార‌ని.. వైద్యులు తెలిపారు. ఇక ఆమెకు డాక్టర్ ప్రతీత్ సమ్దానీ నేతృత్వంలోని వైద్యుల బృందం చికిత్స‌ను అందించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment