Rahul Ramakrishna : ఇక సినిమాల్లో న‌టించేది లేదంటున్న క‌మెడియ‌న్‌.. ఎందుక‌లా..?

February 5, 2022 3:42 PM

Rahul Ramakrishna : జాతి ర‌త్నాలు, అర్జున్ రెడ్డి వంటి సినిమాల్లో న‌టించిన క‌మెడియ‌న్ రాహుల్ రామ‌కృష్ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. త‌న కామెడీతో ఈయ‌న ఎంతో అల‌రించారు. ఇక రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఓ ముఖ్య‌మైన పాత్ర‌లో రాహుల్ క‌నిపించ‌నున్నారు. తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీలో క‌మెడియ‌న్‌గా త‌న‌కంటూ ఈయ‌న ఓ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.

Rahul Ramakrishna surprised everyone that he will quit movies after this year
Rahul Ramakrishna

అయితే రాహుల్ రామ‌కృష్ణ ఇక‌పై సినిమాల్లో న‌టించేది లేద‌ని చెప్పారు. ఈయ‌న తీసుకున్న నిర్ణ‌యం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. క‌మెడియ‌న్‌గా మంచి గుర్తింపు సాధించి ఒక ట్రాక్‌లో ప‌డిన ఈయ‌న ఇంత స‌డెన్‌గా సినిమా ఇండ‌స్ట్రీ నుంచి ఎందుకు త‌ప్పుకుంటున్నారు ? అని ఫ్యాన్స్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

2022 త‌న‌కు చివ‌రి సంవ‌త్స‌రం అని, ఈ ఏడాది త‌రువాత తాను ఇక‌పై సినిమాల్లో న‌టించ‌బోన‌ని రాహుల్ స్ప‌ష్టం చేశారు. త‌న నిర్ణ‌యాన్ని అంద‌రూ స్వాగిస్తార‌ని కోరుకుంటున్నాన‌ని, తాను ఇక‌పై ఈ విష‌యాన్ని లెక్క‌చేయ‌బోన‌ని.. రాహుల్ ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపారు.

అయితే రాహుల్ రామ‌కృష్ణ స‌డెన్ గా ఇంత‌టి షాకింగ్ నిర్ణ‌యం ఎందుకు తీసుకున్నారో అర్థం కావ‌డం లేదు. ఆయ‌న డిప్రెష‌న్‌లో ఉన్నారా ? లేక ఇత‌ర వేరే ఏమైనా కార‌ణాలు ఉన్నాయా ? అన్న‌ది తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment