Tapsee : ఎంతో మందితో అలా చేశా.. అంద‌రూ వేస్ట్ బాయ్ ఫ్రెండ్స్ దొరికారు..

February 3, 2022 11:11 AM

Tapsee : న‌టి తాప్సీ ఎల్ల‌ప్పుడూ ఏవో కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటుంది. తాజాగా ఈమె చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తాప్సీ త‌న బాయ్ ఫ్రెండ్స్ గురించి ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించింది.

Tapsee told interesting things about her boy friends
Tapsee

తాప్సీ మాట్లాడుతూ.. తాను గ‌తంలో చాలా మందితో డేటింగ్ చేశాన‌ని.. ఎంతో మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవార‌ని.. కానీ అంద‌రూ యూజ్‌లెస్‌, వేస్ట్ బాయ్ ఫ్రెండ్స్ అని.. తాప్సీ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసింది. దీంతో ఆమె కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

తాప్సీ బాలీవుడ్‌లో ప‌లు వ‌రుస సినిమా అవ‌కాశాల‌తో బిజీగా ఉంది. ఈమెకు అక్క‌డ సొంత నిర్మాణ సంస్థ కూడా ఉంది. దాంతో త్వ‌ర‌లోనే స‌మంత‌తో క‌లిసి ఓ సినిమా చేయ‌నున్న‌ట్లు గ‌తంలోనే తెలిపింది. అయితే ఆ మూవీపై ఆ త‌రువాత ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు.

తాప్సీ ఈ మ‌ధ్య కాలంలో క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు అస‌లు చేయ‌డం లేదు. కేవ‌లం మ‌హిళా ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌నే ఎంచుకుంటోంది. అలాంటి సినిమాల్లోనే ఆమె న‌టిస్తోంది. ఇక తాజాగా త‌న బాయ్ ఫ్రెండ్స్ ను ఉద్దేశించి తాప్సీ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. సోష‌ల్ మీడియాలో ఈమెపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment