Electric Scooter : ఎలక్రికల్‌ స్కూటర్‌ను కొనాలని చూస్తున్నారా ? బెస్ట్‌ ఆప్షన్లు ఇవిగో..!

February 2, 2022 1:51 PM

Electric Scooter : ప్రస్తుత తరుణంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా పెరిగిపోతున్నాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా మంది ఎలక్ట్రిక్‌ వాహనాలను వాడేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. కార్లు, బైక్‌ల కంపెనీలు ఎలక్ట్రిక్‌ వేరియెంట్లను లాంచ్‌ చేస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్లతో ఉత్తమ మైలేజ్‌ ఇచ్చే విధంగా నూతన ఎలక్ట్రిక్‌ వాహనాలను రూపొందించి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. దీంతో వినియోగదారులు సహజంగానే ఆ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఎలక్ట్రిక్‌ స్కూటర్ల విషయానికి వస్తే మార్కెట్‌లో చాలా స్కూటర్లు అందుబాటులో ఉండడంతో దేన్ని కొనాలో చాలా మందికి తెలియడం లేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న పలు బెస్ట్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల వివరాలను అందజేస్తున్నాం. ఈ స్కూటర్లను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఇవి అత్యంత డిమాండ్‌ను కలిగి ఉండడంతోపాటు పాపులర్‌ కూడా అయ్యాయి. మరి ఆ స్కూటర్లు ఏమిటంటే..

if you want to buy Electric Scooter  look for these best options
Electric Scooter

1. ప్రముఖ క్యాబ్‌ సంస్థ ఓలా రూపొందించిన ఓలా ఎస్‌1 ప్రొ ఇటీవలే మార్కెట్‌లో విడుదలై సంచలనం సృష్టించింది. ఈ స్కూటర్లను చాలా మంది పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ఈ స్కూటర్‌ గంటకు గరిష్టంగా 115 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. 8500 వాట్ల సామర్థ్యం కలిగిన మోటార్‌ ఉంది. 3.97 కిలోవాట్‌ అవర్‌ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఒకసారి ఈ బ్యాటరీని ఫుల్‌ చార్జింగ్‌ చేస్తే సుమారుగా 135 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చు. ఈ స్కూటర్‌ ధర రూ.1,29,999 గా ఉంది.

2. ఏథర్‌ కంపెనీకి చెందిన ఏథర్‌ 450ఎక్స్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కూడా మార్కెట్‌లో మంచి పాపులారిటీని సంపాదించింది. ఈ స్కూటర్‌ గంటకు గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. 6000 వాట్ల సామర్థ్యం కలిగిన మోటార్‌ ఉంది. 2.9 కిలోవాట్‌ అవర్‌ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఉంది. ఒకసారి ఫుల్‌ చార్జింగ్‌ చేస్తే సుమారుగా 116 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చు. ఈ స్కూటర్‌ ధర రూ.1,50,657 గా ఉంది.

3. టీవీఎస్‌ కంపెనీకి చెందిన ఐక్యూబ్‌ అనే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కు కూడా మంచి డిమాండ్‌ ఏర్పడింది. ఈ స్కూటర్‌ గంటకు గరిష్టంగా 78 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. 4400 వాట్ల సామర్థ్యం కలిగిన మోటార్‌ ఉంది. 2.25 కిలోవాట్‌ అవర్‌ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఈ బ్యాటరీని ఫుల్‌ చార్జింగ్‌ చేస్తే సుమారుగా 75 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చు. ఈ స్కూటర్‌ ధర రూ.1,07,938 గా ఉంది.

ఈ స్కూటర్లకు ఫైనాన్స్‌ ఆప్షన్‌లను కూడా అందిస్తున్నారు. మీకు సమీపంలో ఉన్న ఈ స్కూటర్‌ డీలర్ల వద్దకు వెళితే మరింత సమాచారం తెలుసుకోవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment