Shivani Rajashekar : బ్లూ కలర్‌ డ్రెస్ లో మెరిసిపోతున్న హీరో రాజశేఖర్‌ కుమార్తె శివానీ..!

February 1, 2022 5:39 PM

Shivani Rajashekar : సినిమా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు లేదా నటీనటుల వారసులు అరంగేట్రం చేస్తుంటారు. అయితే వారిలో కొందరు మాత్రమే సక్సెస్‌ అవుతారు. ఎంత పెద్ద హీరో లేదా హీరోయిన్ వారసులు అయినా సరే.. సినిమా కథలో దమ్ముండాలి.. అలాగైతేనే ప్రేక్షకులు చూసి ఆదరిస్తారు. అలా ఆదరణ దక్కించుకుంటున్న వారిలో హీరో రాజశేఖర్‌ కుమార్తె శివానీ రాజశేఖర్‌ ఒకరు. ఈమె అద్భుతం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. నటనలోనూ మంచి మార్కులే కొట్టేసింది. కాకపోతే ఆ సినిమా పెద్దగా హిట్‌ కాలేదు.

Shivani Rajashekar latest blue color dress photos
Shivani Rajashekar

ఇక అందరు హీరోయిన్లలాగే శివానీ కూడా అప్పుడప్పుడు ఫొటోషూట్స్‌ చేస్తుంటుంది. తాజాగా ఈమె బ్లూ కలర్‌ డ్రెస్‌లో చేసిన ఫొటోషూట్‌ అలరిస్తోంది. ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. సోషల్‌ మీడియాలోనూ శివానీ ఎల్లప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. తన అభిమానులతో ముఖ్యమైన విషయాలను షేర్‌ చేసుకుంటుంది.

Shivani Rajashekar : చాలా మందికి తెలియలేదు..

శివానీ నటించిన అద్భుతం సినిమా కథ పరంగా బలంగా ఉన్నప్పటికీ ఓటీటీలో విడుదల అవడం ఈ సినిమాకు మైనస్‌ అని చెప్పవచ్చు. థియేటర్లలో ఇలాంటి సైంటిఫిక్‌ సినిమాలు రిలీజ్‌ అయితే ఆదరణ ఎక్కువగానే వస్తుంది. కానీ ఓటీటీలో విడుదలవడం వల్ల ఈ మూవీ రిలీజ్‌ అయినట్లు చాలా మందికి తెలియలేదు. అద్భుతమైన టైమ్‌ ట్రావెల్‌ కథతో అద్భుతం సినిమాను తెరకెక్కించారు. ఇందులో ప్రతి సీన్‌ ఉత్కంఠను కలిగిస్తుంది.

తండ్రి రాజశేఖర్‌, తల్లి జీవితలు ఎంత గొప్ప నటులుగా పేరుపొందారో అందరికీ తెలుసు. వారి కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శివానీ కూడా నటనలో తల్లిదండ్రులకు దీటుగా రాణిస్తోంది. ఈ క్రమంలోనే ఈమె చక్కని అవకాశం కోసం ప్రస్తుతం ఎదురు చూస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment