NTR : ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. ఆయ‌న త‌దుప‌రి చిత్రంలో హీరోయిన్‌గా ఆలియాభ‌ట్‌..!

January 30, 2022 3:17 PM

NTR : యంగ్ టైగ‌ర్ ఎన్‌టీఆర్ తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీలో న‌టించిన విష‌యం విదిత‌మే. ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కావ‌ల్సి ఉంది. కానీ క‌రోనా నేప‌థ్యంలో వాయిదా వేశారు. దీంతో ఏప్రిల్ 28వ తేదీన ఈ మూవీని విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. అందులో భాగంగానే ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి మళ్లీ సినిమా ప్ర‌మోష‌న్ల‌ను ప్రారంభించాలనే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఇక తాజాగా ఎన్‌టీఆర్ కొత్త సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ వ‌చ్చింది.

Alia Bhatt to act in NTR 30th movie
NTR Alia Bhatt

ఎన్‌టీఆర్‌, ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఎన్‌టీఆర్ 30వ చిత్రం త్వ‌ర‌లో లాంచ్ కానుంది. ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో ఈ మూవీని లాంచ్ చేసేందుకు ఆలోచిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక సిబ్బందిని నియ‌మించుకునే ప‌నిలో ప‌డ్డారు.

ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఎన్‌టీఆర్ 30వ చిత్రానికి కొత్త టెక్నిషియ‌న్ల‌తో ప‌నిచేయ‌నున్నారు. ఇక ఈ మూవీలో ఆలియా భ‌ట్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ మేర‌కు ఆమె ఒప్పందంపై సంత‌కాలు చేసింది. మొన్నీ మ‌ధ్య వ‌ర‌కు ఆలియా భ‌ట్‌ను ఎన్‌టీఆర్ చిత్రానికి హీరోయిన్‌గా తీసుకోవాల‌ని కొరటాల అనుకున్నారు. కానీ తాజాగా అందుతున్న స‌మాచారం మేర‌కు ఆలియా భ‌ట్ ఈ చిత్రానికి అధికారికంగా సంత‌కం చేసిన‌ట్లు తెలుస్తోంది.

NTR : ఆలియా హీరోయిన్‌గా ఎంపిక

ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియా భ‌ట్ న‌టించింది. కానీ ఎన్‌టీఆర్ ప‌క్క‌న కాదు. రామ్ చ‌రణ్ హీరోయిన్‌గా ఆమె యాక్ట్ చేసింది. ఈ క్ర‌మంలో ఎన్‌టీఆర్ త‌దుప‌రి చిత్రంలో ఆలియాను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ను జ‌రుపుకోనుంది. ఈ మూవీకి అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందించ‌నున్నారు. గ‌తంలో అనిరుధ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన అజ్ఞాత‌వాసికి మ్యూజిక్ అందించారు. త‌రువాత ఆయ‌న మ్యూజిక్ అందిస్తున్న తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. ఇక ఎన్‌టీఆర్ 30వ చిత్రానికి కొర‌టాల శివ స్నేహితుడు సుధాక‌ర్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now