Rashmi Gautam : ఆ సంఘటనపై రష్మి గౌతమ్‌ ఆగ్రహం.. అలా చేస్తే ఎలా అని కామెంట్‌..

January 29, 2022 8:44 PM

Rashmi Gautam : బుల్లి తెర నటి, యాంకర్‌ రష్మి గౌతమ్‌ మూగజీవాల పట్ల ప్రేమను చూపిస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. వాటికి ఏమైనా అయితే ఆమె తట్టుకోలేదు. ఆమె ఎప్పుడూ జంతు సంరక్షణ కోసం కృషి చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటనపై రష్మి గౌతమ్‌ ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసింది.

Rashmi Gautam very angry over that incident

ఢిల్లీలోని జూలో ఎన్నో సంవత్సరాలుగా ఓ నీటి ఏనుగు ఉంది. దాన్ని రోజూ చాలా మంది సందర్శకులు చూస్తుంటారు. అయితే ఇటీవల ఆ నీటి ఏనుగు తన కేజ్‌ నుంచి తలను బయటకు పెట్టి చూస్తుండగా.. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది దాన్ని లోపలికి పంపించేందుకు తలపై కొట్టాడు.

ఈ క్రమంలో ఆ సంఘటనను ఓ నెటిజన్‌ వీడియో తీసి దాన్ని షేర్‌ చేశాడు. అయితే ఆ వీడియో చూసిన రష్మి ఆగ్రహానికి గురైంది. జంతువుల పట్ల జూ సిబ్బంది వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని, ఇది బాధాకరమైన విషయమని పేర్కొంది. కాగా లాక్‌ డౌన్‌ సమయంలో తాము ఇంట్లో మూడు నెలలు ఉండేందుకు ఇబ్బందులు పడ్డామని, అలాంటిది వాటిని అలా బంధించి ఉంచితే వాటికి ఎంత బాధ కలుగుతుందో చెప్పలేమని.. రష్మి తెలిపింది. ఈ క్రమంలోనే జూ ను నిషేధించాలి.. అని ఆంగ్లంలో హ్యాష్‌ట్యాగ్‌ను ఆమె జత చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment