Prabhas : ద‌ర్శ‌కుడు మారుతికి గోల్డెన్ చాన్స్‌..? సినిమాకు ఓకే అన్న ప్ర‌భాస్‌..?

January 29, 2022 3:50 PM

Prabhas : ద‌ర్శ‌కుడు మారుతికి గోల్డెన్ చాన్స్ ల‌భించిందా ? అంటే.. అందుకు అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ఏకంగా ప్ర‌భాస్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే చాన్స్ కొట్టేశాడ‌ని అంటున్నారు. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ చేస్తున్న మారుతి త‌రువాత త‌న సినిమాను ప్ర‌భాస్‌తో చేయ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఈ మేర‌కు ఫిలింన‌గ‌ర్‌లో ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది.

Prabhas may do movie with director maruthi

చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న మారుతికి ప్ర‌భాస్ ఒక్క చాన్స్ ఇచ్చార‌ట‌. దీంతో ప్ర‌భాస్‌కు మారుతి క‌థ వినిపించ‌గానే.. అందుకు ప్ర‌భాస్ అంగీక‌రించార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆ మూవీ కామెడీ, యాక్ష‌న్‌, డ్రామా జోన‌ర్‌ల‌లో ఉంటుంద‌ని తెలుస్తోంది. ప్ర‌భాస్ ఇలాంటి సినిమాను ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌లేద‌ని అంటున్నారు. అందువ‌ల్ల క‌చ్చితంగా సినిమా హిట్ అయ్యేందుకు అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు.

కాగా ఈ సినిమాకు ప్ర‌భాస్ ఒప్పుకున్నార‌ని.. మ‌రో రెండు మూడు రోజుల్లో అగ్రిమెంట్ కూడా అవుతుంద‌ని తెలుస్తోంది. వెంక‌టేష్ న‌టించిన బాబు బంగారం సినిమా త‌రువాత అంత‌టి పెద్ద స్టార్ సినిమాకు మారుతి ద‌ర్శ‌కత్వం వ‌హించ‌నున్నారు. అయితే ప్ర‌భాస్‌తో చేసే సినిమా హిట్ గ‌న‌క అయితే మారుతి అగ్ర ద‌ర్శ‌కుల క్లబ్‌లో చేర‌డం ఖాయ‌మ‌ని అంద‌రూ అంటున్నారు. ఇక ఈ సినిమా వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. దీనికి ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దాన‌య్య నిర్మాణ బాధ్య‌త‌లు వ‌హిస్తార‌ని స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now