Shruti Haasan : ప్ర‌భాస్‌పై శృతి హాస‌న్ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌..!

January 29, 2022 10:41 AM

Shruti Haasan : ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ హీరోగా, శృతి హాస‌న్ హీరోయిన్‌గా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న యాక్ష‌న్ సినిమా.. స‌లార్‌. ఈ మూవీ ప్ర‌స్తుతం షూటింగ్‌ను జ‌రుపుకుంటోంది. అయితే క‌రోనా వ‌ల్ల సినిమా షెడ్యూల్ కాస్త వెనుక‌బ‌డింది. ఇక తాజాగా శృతి హాస‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ సినిమాలో ఆమె పాత్ర‌కు చెందిన ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. అందులో శృతి హాస‌న్ ఆద్య‌గా ఆక‌ట్టుకుంటోంది.

Shruti Haasan interesting comments on prabhas

ఇక శృతి హాస‌న్ ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌తో క‌లిసి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుండ‌గా.. ప్ర‌భాస్‌పై ఆమె ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. ప్ర‌భాస్ ఒక గొప్ప వ్య‌క్తి అని శృతి కితాబిచ్చింది. అత‌ను భోజ‌న ప్రియుడ‌ని, అంద‌రికీ స‌రైన భోజ‌నం పెట్టించ‌డంలో దిట్ట అని పొగిడింది. ప్ర‌భాస్ త‌న ప్రేమ‌ను భోజ‌నం ద్వారా తెలియ‌జేస్తాడ‌ని పేర్కొంది. అత‌నితో న‌టించ‌డం గొప్ప అనుభూతిని ఇస్తుంద‌ని చెప్పింది.

ఇక స‌లార్ సినిమాలో త‌న పాత్ర వైవిధ్యంగా ఉంటుంద‌ని శృతి చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతానికి త‌న పాత్ర గురించి ఏమీ రివీల్ చేయ‌లేన‌ని.. కానీ అంద‌రినీ ఆక‌ట్టుకునే విధంగా ఉంటుంద‌ని తెలిపింది. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ గొప్ప విజ‌న్ ఉన్న వ్య‌క్తి అని తెలిపింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now