Keerthy Suresh : కీర్తి సురేష్‌ను వెంటాడుతున్న ఫ్లాప్‌లు..!

January 29, 2022 8:27 AM

Keerthy Suresh : మ‌హాన‌టి సినిమాతో మ‌ళ‌యాళం బ్యూటీ కీర్తి సురేష్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీతో ఆమెకు జాతీయ అవార్డు వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ మ‌హాన‌టి సినిమా త‌రువాత ఈమెకు ఒక్క హిట్ కూడా రాలేదు. దీంతో ఎన్నో అంచ‌నాల న‌డుమ తాజా చిత్రం గుడ్ ల‌క్ స‌ఖి విడుద‌లైంది.

Keerthy Suresh haunted by series of flop movies

అయితే పెంగ్విన్‌, మిస్ ఇండియా, రంగ్ దే వంటి చిత్రాలు భిన్న జోన‌ర్‌ల‌లో తీశారు. వీటిల్లో కీర్తి సురేష్‌కు ఒక్క హిట్ కూడా రాలేదు. ఈ క్ర‌మంలోనే ఆమె గుడ్ ల‌క్ స‌ఖి అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేసి దీనిపైనే ఆశ‌లు పెట్టుకుంది. అయితే ఆ ఆశ‌లు అడియాశ‌లు అయ్యాయి. ఈ సినిమాకు కొంత వ‌ర‌కు పాజిటివ్ టాక్ ల‌భించినా.. మొత్తంగా చూస్తే విమ‌ర్శ‌లే ఎక్కువ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో కీర్తి సురేష్ ఖాతాలో మ‌రో ఫ్లాప్ చేరింద‌ని అంటున్నారు.

జాతీయ అవార్డు విన్నింగ్ డైరెక్ట‌ర్ న‌గేష్ కుకునూర్‌, జాతీయ అవార్డు న‌టి, ఎడిట‌ర్ శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్‌, టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవి శ్రీ‌ప్ర‌సాద్ వంటి హేమాహేమీలు గుడ్ ల‌క్ స‌ఖి సినిమా కోసం ప‌నిచేసినా.. సినిమా ఆశించిన స్థాయి మేర రాలేద‌ని విమ‌ర్శ‌కులు అంటున్నారు. దీంతో నెగెటివ్ రివ్యూలు కూడా ఎక్కువ‌య్యాయి. అయితే కీర్తి సురేష్ ఇక‌పై చేసే సినిమాలతో అయినా హిట్ సాధిస్తుందా, లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment