Prabhas : ప్ర‌భాస్‌ను ఊరిస్తున్న ఆ అదృష్టం.. ల‌క్ క‌ల‌సి వ‌స్తుందా..?

January 28, 2022 9:46 PM

Prabhas : బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్ ఒక్క‌సారిగా పాన్ ఇండియా స్థాయి స్టార్ అయిపోయాడు. దీంతో ఆయ‌న త‌రువాత న‌టించిన సాహో భారీ హిట్ అయింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌భాస్ ప్రస్తుతం ప‌లు వ‌రుస పాన్ ఇండియా ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. అయితే ప్ర‌భాస్‌ను ఆది పురుష్ రూపంలో ఓ అదృష్టం వ‌రించ‌బోతుంద‌ని అంటున్నారు. అది ఏమిటంటే..

Prabhas will become international star if luck comes to him

ఓమ్ రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం.. ఆది పురుష్‌. ఇందులో ప్ర‌భాస్ రాముడిగా న‌టిస్తుండ‌గా.. సీత పాత్ర‌లో కృతి స‌న‌న్ న‌టిస్తోంది. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకోగా.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చేస్తున్నారు. వ‌చ్చే ఆగ‌స్టు 11వ తేదీన ఈ మూవీని రిలీజ్ చేయాల‌ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమా క‌థ అంద‌రికీ తెలిసిందే. రామాయ‌ణం ఆధారంగా ఈ మూవీని తెర‌కెక్కించారు. అందువ‌ల్ల క‌థ ప్ర‌తి ఒక్క‌రికీ తెలుసు. అయితే భార‌త్‌లో.. ముఖ్యంగా ఉత్తరాదిలో చాలా మందికి రాముడు అంటే సెంటిమెంట్ ఎక్కువ‌. ఆ మాట‌కొస్తే ప్ర‌పంచ వ్యాప్తంగా రామాయ‌ణం అనేది యూనివ‌ర్స‌ల్ స‌బ్జెక్ట్‌. ఇది అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. క‌నుక ఈ మూవీని భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా ఏకంగా 15 భాషల్లో రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

రాముడు అంటే యూనివ‌ర్స‌ల్ క‌నుక అంద‌రూ ఈ సినిమా చూస్తారు. దీనికి వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. దీంతో ఆ ఆద‌ర‌ణ‌ను క్యాష్ చేసుకునేందుకు అధిక సంఖ్య‌లో భాష‌ల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ ద్వారా ప్ర‌భాస్ అంత‌ర్జాతీయ స్టార్ అవుతాడ‌ని అంటున్నారు. దీంతో ప్ర‌భాస్‌ను ఆ అదృష్టం వ‌రించ‌బోతుంద‌ని చెబుతున్నారు. ఈ మూవీ గ‌నుక హిట్ అయితే ప్ర‌భాస్ ద‌శ మారిపోతుంద‌ని, వ‌ర‌ల్డ్ వైడ్ స్టార్ అవుతాడ‌ని.. అప్పుడు ప్ర‌భాస్ రేంజే వేరుగా ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి ప్ర‌భాస్‌కు ఆది పురుష్ చిత్రంతో ల‌క్ క‌ల‌సి వ‌స్తుందా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now